ఇండస్‌ఇండ్ లాభంలో 25% వృద్ధి

Fri,October 13, 2017 12:54 AM

IndusInd Bank posts 25% YoY surge in Q2 profit at Rs 880 crore

indusind
ముంబై, అక్టోబర్ 12: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో రూ.880.10 కోట్ల నికర లాభాన్ని ఆర్జించినట్లు ఇండస్‌ఇండ్ బ్యాంక్ ప్రకటించింది. కమర్షియల్ వాహన రుణాలకు డిమాండ్ అధికంగా ఉండటంతో లాభంలో 25 శాతం వృద్ధి నమోదైందని బ్యాంక్ ఎండీ రోమేష్ సోబ్టి తెలిపారు. ఆదాయం విషయానికి వస్తే రూ.5,395.92 కోట్లుగా నమోదైనట్లు ఫలితాల విడుదల సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన చెప్పారు. సమీక్షకాలంలో బ్యాంక్ స్థూల నిరర్థక ఆస్తుల విలువ 1.08 శాతంగాను, నికర ఎన్‌పీఏ 0.44 శాతంగా నమోదైందన్నారు. మొండి బకాయిలను పూడ్చుకోవడానికి రూ.294 కోట్ల నిధులను వెచ్చించాల్సి వచ్చిందన్నారు. సెప్టెంబర్ 31 నాటికి బ్యాంక్ వ్యాపారం రూ.2,64,622 కోట్లుగా నమోదైంది.

118

More News

VIRAL NEWS