రూ.999కే విమాన టిక్కెట్టు

Wed,June 12, 2019 01:02 AM

IndiGo announces special summer sale, fares start as low as Rs 999

-ఇండిగో సమ్మర్ సేల్ ఆఫర్
న్యూఢిల్లీ, జూన్ 11: ప్రముఖ విమానయనా సంస్థ ఇండిగో.. సమ్మర్ సేల్ పేరుతో నాలుగు రోజుల పాటు ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. ఈ నెల 14 వరకు అమలులో ఉండనున్న ఈ ప్రత్యేక ఆఫర్ కింద దేశీయ ప్రారంభ విమాన టిక్కెట్టు ధరను రూ.999గాను, అంతర్జాతీయ టిక్కెట్టు ధరను రూ.3,499గా నిర్ణయించింది. ఈ ఆఫర్ కింద బుకింగ్ చేసుకున్న ప్రయాణికులు జూన్ 16 నుంచి సెప్టెంబర్ 28 లోపు ఎప్పుడైనా ప్రయాణం చేయవచ్చునని కంపెనీ చీఫ్ కమర్షియల్ అధికారి విలియమ్ బౌల్టర్ తెలిపారు. ఇందుకోసం సంస్థ 10 లక్షల టిక్కెట్లను సిద్ధంగా ఉంచినట్లు చెప్పారు. వీటితోపాటు ఇండస్‌ఇంద్ బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డు ద్వారా బుకింగ్ చేసుకున్న ప్రయాణికులు 20 శాతం క్యాష్ బ్యాక్, ఐసీఐసీఐ బ్యాంక్ కార్డు కలిగిన వారికి 5 శాతం నగదు రాయితీ, మొబిక్విక్ వ్యాలెట్ ద్వారా బుకింగ్ చేసుకున్నవారికి 15 శాతం రాయితీ లభించనున్నది.

2774
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles