స్వల్పంగా పెరిగిన పారిశ్రామిక ఉత్పత్తి

Wed,June 13, 2018 12:22 AM

Indias Industrial production grows by 4 9 percent in April 2018

industry-production
నూఢిల్లీ, జూన్ 12: ఏప్రిల్ నెలలో దేశీయ పారిశ్రామిక ఉత్పత్తి 4.9 శాతం మేర పెరిగింది. గత ఏడాది ఏప్రిల్ నెలలో 3.2 శాతంగా నమోదు అయింది. కేంద్ర గణాంకాల కార్యాలయం విడుదల చేసిన వివరాల ప్రకారం క్యాపిటల్ గూడ్స్ రంగం గరిష్ఠంగా 13 శాతం మేర వృద్ధి చెందడంతో 4.9 శాతం వృద్ధి సాధ్యమైంది. అయితే ఏప్రిల్ నెలలో దాదాపు 6 శాతం వృద్ధి చెందగలదన్న మార్కెట్ వర్గాల అంచనాలకు తక్కువగా నమోదు అయింది. కన్జ్సూమర్ డ్యూరబుల్స్ రంగం వృద్ధి రేటు 4.1 శాతం నుంచి 4.3 శాతానికి పెరిగింది. నాన్ కన్జ్సూమర్ డ్యూరబుల్స్ పరిశ్రమ వృద్ది రేటు 12.7 శాతం నుంచి 7 శాతానికి పడిపోయింది. ఐఐపీలో అత్యధిక వెయిటేజివున్న తయారీ రంగం వృద్దిరేటు 4.7 శాతం నుంచి 5.2 శాతానికి పెరిగింది. మైనింగ్ రంగం వృద్ధి రేటు 5.1 శాతానికి పెరగ్గా, విద్యుత్ రంగ వృద్ధి 5.9 శాతం నుంచి 2.1 శాతానికి తగ్గింది. ప్రైమరీ గూడ్స్ రంగం 3.1 శాతం వృద్ధి చెందగా, ఇంటర్మీడియట్ గూడ్స్ రంగం వృద్ధి 3.6 శాతం నుంచి 1.6 శాతానికి పడిపోయింది. కాగా, మార్చి నెలకు పారిశ్రామికోత్పత్తి వృద్ధి రేటును 4.4 శాతం నుంచి 4.6 శాతానికి సవరించారు.

572
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles