21 నెలల కనిష్ఠానికి పారిశ్రామికం

Sat,May 11, 2019 04:30 AM

Indias industrial output in March contracts 0.1 Percent

-మార్చిలో 0.1 శాతంగా నమోదు

న్యూఢిల్లీ, మే 10: పారిశ్రామిక ప్రగతికి మళ్లీ బ్రేకులు పడ్డాయి. తయారీ రంగంలో నెలకొన్న నిస్తేజం కారణంగా మార్చి నెలలో పారిశ్రామిక వృద్ధిరేటు 0.1 శాతానికి పరిమితమైంది. గడిచిన 21 నెలలో ఇదే కనిష్ఠ స్థాయి. శుక్రవారం కేంద్ర గణాంకాల శాఖ విడుదల చేసిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. క్రితం ఏడాది ఇదే నెలలో వృద్ధి 5.3 శాతంగా ఉన్నది. జూన్ 2017లో నమోదైన 0.3 శాతం వృద్ధి ఇప్పటి వరకు కనిష్ఠ వృద్ధి. అలాగే గడిచిన ఆర్థిక సంవత్సరం మొత్తానికి ఐఐపీ మూడేండ్ల కనిష్ఠ స్థాయి 3.6 శాతానికి జారుకున్నది. 2017-18లో 4.4 శాతంగా నమోదైన పారిశ్రామికం..2016-17లో 4.6 శాతంగాను, 2015-16లో 3.3 శాతంగా నమోదైంది. ఫిబ్రవరి నెలకుగాను విడుదలైన గణాంకాలను 0.1 శాతానికి బదులు 0.07 శాతానికి తగ్గించింది. దేశీయ పారిశ్రామిక రంగంలో 77.63 శాతం వాటా కలిగిన తయారీ రంగం 0.4 శాతానికి పరిమితం కావడం పనితీరుపై ప్రతికూల ప్రభావం చూపింది. అంతకుముం దు ఏడాది ఇదే నెలలో 5.7 శాతంగా ఉన్నది. క్యాపిటల్ గూడ్స్ ఉత్పత్తి 8.7 శాతం ప్రతికూలానికి పడిపోయింది. విద్యుత్ రంగంలో నెలకొన్న మందకొడి కారణంగా ఈ రంగ వృద్ధి 2.2 శాతానికి పరిమితమైంది. అలాగే గనులు కూడా 0.8 శాతానికి జారుకున్నాయి. ప్రైమరీ గూడ్స్‌లో వృద్ధి 2.5 శాతంగా ఉండగా, ఇంటర్‌మీడియట్ గూడ్స్ -2.5 శాతానికి, మౌలిక/నిర్మాణ రంగ పరికరాల్లో వృద్ధి 6.4 శాతంగా ఉన్నది. 23 తయారీ రంగాల్లో 12 ప్రతికూల వృద్ధిని నమోదు చేసుకోగా, కేవలం తొమ్మిది మాత్రమే పెరుగుదల కనిపించింది.

442
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles