సింగపూర్, హాంకాంగ్‌తో పోలిస్తే మా వద్ద తక్కువే


Mon,June 19, 2017 02:57 AM

భారతీయుల డిపాజిట్లపై స్విస్ బ్యాంకులు

SWISS-BANK
న్యూఢిల్లీ, జూన్ 18: అంతర్జాతీయ ఆర్థిక కేంద్రాలుగా విరాజిల్లుతున్న సింగపూర్, హాంకాంగ్‌తో పోలిస్తే మావద్ద భారతీయుల డిపాజిట్లు తక్కువేనని స్విస్ బ్యాంకులంటున్నాయి. 2015 చివరినాటికి స్విస్ బ్యాంకుల్లో మనోళ్ల డిపాజిట్లు రికార్డు కనిష్ఠ స్థాయి అయిన 120 కోట్ల ఫ్రాంక్‌లకు (రూ.8,392 కోట్లు) తగ్గాయి. అంతర్జాతీయ ఆర్థిక కేంద్రాల్లోని బ్యాంకుల్లో ఇండియన్ల డిపాజిట్లపై అధికారిక వివరాలు మాత్రం అందుబాటులో లేవు. నల్లధనానికి స్వర్గధామంగా పేరున్న స్విట్జర్లాండ్‌తోపాటు ఇతర దేశాల్లో భారతీయులు దాచుకున్న నల్లధనాన్ని వెలికి తీసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలను ముమ్మరం చేసింది. ఇందులోభాగంగా స్విట్జర్లాండ్‌తో ఎప్పటికప్పుడు సమాచారం ఇచ్చిపుచ్చుకునేందుకు భారత్ ఒప్పందం కుదుర్చుకుంది. పన్ను ఎగవేతదారులపై భారత్‌తోపాటు మరో 40 దేశాలతో సమాచారాన్ని పంచుకునేందుకు కుదుర్చుకున్న ఒప్పంద నిర్ణయాన్ని గతవారం స్విస్ అధికారికంగా ఆమోదించింది.

సమాచారం ఇచ్చిపుచ్చుకోవడంలో గోప్యత పాటించాల్సిందే.. ఎప్పటికప్పుడు సమాచారం పంచుకునేందుకు కుదుర్చుకున్న ఒప్పందంలోభాగంగా అందించే పన్ను ఎగవేతదారుల వివరాల విషయంలో తప్పనిసరిగా గోప్యత పాటించాల్సిందేనని భారత్‌కు స్విస్ ప్రభుత్వం స్పష్టం చేసింది. గోప్యత పాటించడంలో విఫలమైతే ఆ తర్వాత నుంచి సమాచారం పంచుకోవడం జరుగదని హెచ్చరించింది.

277

More News

VIRAL NEWS