మళ్లీ పెరిగిన ఇంధన ధరలు


Wed,May 16, 2018 12:18 AM

petrol-price
లీటర్ పెట్రోల్‌పై 15 పైసలు, డీజిల్‌పై 22 పైసలు వడ్డింపు
న్యూఢిల్లీ, మే 15: పెట్రో ధరలు మళ్లీ పెరిగాయి. ఢిల్లీలో మంగళవారం లీటర్ పెట్రోల్ ధర 15 పైసలు ఎగిసి రూ.74.95 వద్దకు చేరగా, డీజిల్ ధర 22 పైసలు ఎగబాకి రూ.66.36 స్థాయిని తాకింది. సోమవారం పెట్రోల్ 17 పైసలు, డీజిల్ 21 పైసలు పెరిగిన విషయం తెలిసిందే. తాజా వడ్డింపులతో డీజిల్ ధర మరో సరికొత్త ఆల్‌టైమ్ హైకి చేరితే, పెట్రోల్ ధర 2013 సెప్టెంబర్ (రూ.76.06) తర్వాత గరిష్ఠ స్థాయిని అందుకున్నది. ఇక హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ 16 పైసలు పెరిగి రూ.79.39, డీజిల్ 24 పైసలు పెరిగి రూ.72.13 వద్ద నిలిచాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరుగుతున్నా.. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా 19 రోజులపాటు దేశీయ చమురు మార్కెటింగ్ సంస్థలు పెంపు జోలికి వెళ్లలేకపోయాయి. అయితే ఎన్నికలు ముగియగానే తిరిగి ధరల మోత మోగించడం మొదలు పెట్టేశాయి. ఇదిలావుంటే ఈ 19 రోజుల్లో చమురు కంపెనీలకు రోజుకు రూ.35 కోట్ల మేర నష్టం వాటిల్లిందని అంచనా.

1160
Tags

More News

VIRAL NEWS