ఈ ఏడాది వృద్ధి 7.3 శాతం ప్రపంచ బ్యాంక్ అంచనా

Wed,January 9, 2019 11:59 PM

Indian Economy Expected To Grow At 7.3 Percentage In 2018 to 2019 World Bank

వాషింగ్టన్, జనవరి 9: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటు 7.3 శాతంగా ఉంటుందని ప్రపంచబ్యాంక్ అంచనావేస్తున్నది. ఆ తర్వాతి రెండు ఆర్థిక సంవత్సరాల్లో సరాసరిగా వృద్ధి 7.5 శాతంగా ఉంటుందని తెలిపింది. పెట్టుబడులు, వినియోగంతో పెరుగుదలే దీనికి కారణమని బ్యాంక్ విశ్లేషించింది. అంతేకాక వేగంగా అభివృద్ధి చెందుతున్న అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో భారత్ కొనసాగనున్నదని పేర్కొంది. ఇదే సమయంలో పొరుగు దేశమైన చైనా వృద్ధిరేటు 6.2 శాతంగా ఉంటుందని వరల్డ్ బ్యాంక్ అంచనావేస్తున్నది. 2021లో మాత్రం ఇంకా తగ్గి 6 శాతానికి పరిమితం కానున్నదని 2019 సంవత్సరానికిగాను అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థపై విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. గతేడాది విషయానికి వస్తే చైనా 6.5 శాతం వృద్ధిని అంచనావేస్తున్న ప్రపంచ బ్యాంక్..ఇదే భారత్ 7.3 శాతంగా ఉండనున్నదని తెలిపింది.

పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ కారణంగా భారత ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఒడిదుడుకులకు లోనవడంతో 2017లో దేశ వృద్ధి 6.7 శాతానికి పరిమితం కాగా, ఇదే సమయంలో చైనా 6.9 శాతం నమోదు చేసుకున్నది. దేశీయ వృద్ధిలో గతేడాది భారత కంటే చైనా ముం దుందని, అయితే ఈ ఏడాది మాత్రం ఆ దేశ వృద్ధి మందగిస్తున్నది అంచనావేస్తున్నది. ప్రస్తుతానికి అత్యధిక వృద్ధిని నమోదు చేసుకుంటున్న భారత్..భవిష్యత్తుల్లోనే ఇదే జోరు కొనసాగనున్నదని వరల్డ్ బ్యాంక్ ప్రాస్‌పెక్ట్స్ గ్రూపు డైరెక్టర్ అయాన్ కోస్ తెలిపారు. వినియోగంలో పెరుగుదల, పెట్టుబడులు భారీగా పుంజుకోవడంతో ఈ ఏడాది వృద్ధి 7.5 శాతానికి ఎగబాకనున్నని చెప్పారు. దేశవ్యాప్తంగా డిమాండ్ ఊపందుకోవడం, నిర్మాణాత్మక సంస్కరణలకు పెద్దపీట వేయడంలోభాగంగా అమలులోకి తెచ్చిన జీఎస్టీ, బ్యాంకులను ఆర్థికంగా బలోపేతం చేయడానికి భారీ స్థాయిలో నిధుల కేటాయించడం కూడా ఆర్థిక వృద్ధి మరింత పరుగులు పెట్టనున్నదని తెలిపింది.

దీనికితోడు ప్రైవేట్ వినిమయం పెరుగుతుండటం, పెట్టుబడులను ఆకట్టుకోవడానికి ఇటీవల ప్రవేశపెట్టిన పాలసీ నిర్ణయాలు పరోక్షంగా దోహదం చేశాయని, ముఖ్యంగా వచ్చే ఏడాది జీడీపీలో కరెంట్ ఖాతాలోటు(క్యాడ్) 2.6 శాతానికి పరిమితంకానున్నదని వెల్లడించింది. ద్రవ్యోల్బణ విషయానికి వస్తే 2 శాతం నుంచి 6 శాతం మధ్యలో ఉంటుందని రిజర్వు బ్యాంక్ అంచనాకు వరల్డ్ బ్యాంక్ జై కొట్టింది. ఇటీవల అమలులోకి వచ్చిన జీఎస్టీ, పెద్ద నోట్ల రద్దుతో అనాధికార విభాగం నుంచి అధికార విభాగానికి బదిలీ అయ్యేవారు పెరిగారని తెలిపింది. భారత్ నికరంగా ఏడు శాతం వృద్ధిని సాధించనున్నదని, భవిష్యత్తులో కూడా ఇంతే స్థాయిలో కొనసాగనున్నదని విలేకరు అడిగిన ప్రశ్నకు కోస్ సమాధానమిచ్చారు. ఈ ఏడాది ఎన్నికల సంవత్సరం కావడంతో నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర సర్కార్ సంస్కరణలకు మొగ్గుచూపే అవకాశాలు లేవని ఆయన స్పష్టంచేశారు.

మూడో అతిపెద్ద వినిమయ మార్కెట్

ప్రపంచంలోనే మూడో అతిపెద్ద వినిమయ మార్కెట్‌గా భారత్ అవతరించనున్నదని వరల్డ్ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) అంచనా వేసింది. అమెరికా, చైనా తర్వాత భారతీయ కన్జ్యూమర్ మార్కెటేనని బుధవారం ఓ నివేదికలో అభిప్రాయపడింది. 2030 నాటికి ప్రస్తుతమున్న 1.5 లక్షల కోట్ల డాలర్ల నుంచి దాదాపు 6 లక్షల కోట్ల డాలర్లకు కన్జ్యూమర్ మార్కెట్ పెరిగే వీలుందని చెప్పింది.

483
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles