సవాళ్లను ఎదుర్కొంటున్నాం: నిర్మలా సీతారామన్‌

Mon,November 11, 2019 03:35 AM

న్యూఢిల్లీ, నవంబర్‌ 10: ప్రస్తుతం ప్రపంచంతోపాటు భారత ఆర్థిక వ్యవస్థ సవాళ్లను ఎదుర్కొంటున్నదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ స్పష్టంచేశారు. ఆదివారం వీ అనంత నాగేశ్వరన్‌, గుల్జర్‌ నటరాజన్‌ సంయుక్తంగా రాసిన ది రైజ్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ బుక్‌ను ఆమె ఆవిష్కరించారు. ఐఎఫ్‌ఎం గ్రాడ్యుయేట్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ డీన్‌గా నాగేశ్వరన్‌ వ్యవహరిస్తుండగా, నటరాజన్‌ మాత్రం గ్లోబల్‌ ఇన్నోవేషన్‌ ఫండ్‌ ఎండీగా ఉన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..ప్రస్తుత ఆర్థిక పరిస్థితులకు తగ్గట్టుగా ఈ పుస్తకాన్ని రాశారని, ఇది మరింత ప్రాచుర్యం పొందేదాంట్లో ఎలాంటి అనుమానం లేదని, పాలసీల రూపకల్పనలో ఇది కీలకంకానున్నదన్నారు.


భారత్‌లో సరైన సమయంలో భారత్‌లో ఈ పుస్తకం విడుదల చేశారని పేర్కొన్నారు. అంతర్జాతీయంగా నెలకొన్న మందకొడి పరిస్థితుల వల్లనే దేశీయ ఆర్థిక వ్యవస్థ కుదేలైంది తప్పా..అంతర్గతంగా ఎలాంటి ఇబ్బందులు లేవని మంత్రి స్పష్టంచేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో దేశ వృద్ధిరేటు ఆరేండ్ల కనిష్ఠ స్థాయి 5 శాతానికి పడిపోయిన విషయం తెలిసిందే. వినియోగదారుల్లో డిమాండ్‌ పడిపోవడం, ప్రైవేటు పెట్టుబడులు మందగించడం, గ్లోబల్‌ పరిస్థితులు నిరాశాజనకంగా నమోదవడం ఇందుకు కారణం.

143
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles