విజయాలు ముందున్నాయ్: కాంత్

Sun,December 15, 2019 12:06 AM

వాషింగ్టన్, డిసెంబర్ 14: కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు తీసుకుంటున్న నిర్ణయాలు, చేపడుతున్న సంస్కరణలు.. దీర్ఘకాలంలో ప్రయోజనాలను అందిస్తాయని, ఆర్థిక విజయాలు ముందున్నాయని నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను పోటీయుతంగా, ఉత్పాదక కేంద్రంగా మలుస్తాయన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన శుక్రవారం పీటీఐకిచ్చిన ఇంటర్వూలో మాట్లాడుతూ ‘భారత్‌పై అంతర్జాతీయ మదుపరుల్లో గొప్ప నమ్మకం ఉంది’ అన్నారు. బోస్టన్, న్యూయార్క్, వాషింగ్టన్ డీసీ నగరాల్లో కాంత్ పర్యటించారు. ఈ సందర్భంగా విద్యావేత్తలు, ఆవిష్కర్తలు, స్టార్టప్‌లు, కార్పొరేట్ లీడర్లు, ప్రభుత్వ అధికారులతో ఆయన సమావేశమైయ్యారు.

252
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles