డిజిటల్ నాగరికతలో భారత్‌కు ఏడో స్థానం

Thu,February 7, 2019 12:37 AM

India Ranks 7th in Digital Civility Index Among 22 Countries Surveyed

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: డిజిటల్ నాగరికతలో భారత్ ఏడో స్థానంలో నిలిచిందని మైక్రోసాఫ్ట్ తాజాగా వెల్లడించింది. ఆన్‌లైన్ భద్రతపై ఉన్న నిలబద్ధతలో భాగంగా, సేఫర్ ఇంటర్నెట్ డే సందర్భంగా మైక్రోసాఫ్ట్ 3వ డిజిటల్ సివిలిటీ ఇండెక్స్‌ను విడుదల చేసింది. భారత్‌తో సహా ప్రపంచ వ్యాప్తంగా ఆన్‌లైన్‌లో ప్రజలు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారని తాజా ఇండెక్స్‌లో వెల్లడించింది. ఆన్‌లైన్‌లో18 నుంచి 34 ఏండ్ల వయసు గల యువకుల ఆలోచనలు, భావనల్ని తెలుసుకునేందుకు మే 2018లో మైక్రోసాఫ్ట్ సర్వే నిర్వహించింది. ఇందులో భాగంగా టీనేజీ (13-17 ఏండ్లు), పెద్దల (18-74 ఏండ్లు) అభిప్రాయాలు, ఆలోచనల్ని కనుగొన్నది. టీనేజీ పిల్లలు ఆన్‌లైన్ రిస్క్ ఏర్పడినప్పుడు తల్లిదండ్రులు లేదా నమ్మిన పెద్దవారిపైపు పరిష్కారం కోసం చూస్తున్నారని తేలింది.

సర్వేలో పలు కీలకాంశాలు..

-ఆన్‌లైన్‌లో అసహ్యమైన కంటెంట్‌ను అం దుకోవడం, తప్పుడు వార్తలు రావడం, ఇంటర్నెట్ తమాషాలు ఎదుర్కోవడం వంటివి భారత్ వంటి దేశానికి చెందినవారు ఎదుర్కొంటున్నారు.
-ఆన్‌లైన్ నష్టాల వల్ల మిలీనయల్స్ (18-34 ఏండ్లు)పై అధిక ప్రభావం పడుతుంది.
-ఆన్‌లైన్ నేరాలకు పాల్పడేవారిలో కుటుం బ సభ్యులు లేదా స్నేహితులే 29 శాతం ఉంటున్నారు.
-ఆన్‌లైన్‌తో పాటు ఆఫ్‌లైన్‌లోనూ ఇతరులపై నమ్మకం లేదని సర్వేలో పాల్గొన్న అనేక మంది తెలియజేశారు.
-ఆన్‌లైన్‌లో ప్రతికూల పరిస్థితుల కారణంగా ఒత్తిడి, నిద్రలేమితో అధిక శాతం మంది బాధపడుతున్నారు.

1148
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles