భారత్ @ 2

Fri,November 9, 2018 12:41 AM

india pips US to become 2nd largest smartphone market in Q3

స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో అమెరికాను దాటేసిన దేశం
న్యూఢిల్లీ, నవంబర్ 8: భారత చరిత్రలో మరో కలికితురాయి చేరింది. ఇప్పటికే స్మార్ట్‌ఫోన్ల వినియోగంలో రాకెట్‌లో దూసుకుపోతున్న భారత్..తాజాగా స్మార్ట్‌ఫోన్ల విక్రయాల్లో అగ్రరాజ్యం అమెరికాను వెనక్కినెట్టి రెండో స్థానాన్ని కైవసం చేసుకున్నట్లు ప్రముఖ పరిశోధన సంస్థ కెనాల్సిస్ తెలిపారు. ప్రస్తుత సంవత్సరం మూడో త్రైమాసికంలో(జూలై-సెప్టెంబర్) 4.04 కోట్ల స్మార్ట్‌ఫోన్లు భారత్ ఇతర దేశాలకు ఎగుమతి చేసింది. ఇదే సమయంలో చైనా 10.06 కోట్లతో తొలిస్థానంలో ఉండగా, ఆ తర్వాతి స్థానంలో భారత్ నిలిచింది. అమెరికా విషయానికి వస్తే 4 కోట్ల స్మార్ట్‌ఫోన్‌లను ఎగుమతి చేసింది. అమెరికాను దాటేసిన భారత్‌లో స్మార్ట్‌ఫోన్ల అమ్మకాలు గతేడాదితో పోలిస్తే అంతంత మాత్రంగానే ఉన్నాయని నివేదిక తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్‌ఫోన్ల ఎగుమతులు 7.2 శాతం తగ్గి 23.89 కోట్లకు పరిమితమయ్యాయి. వృద్ధి విషయానికి వస్తే ఇండోనేషియా(13 శాతం వృద్ధి), రష్యా(11.5 శాతం), జర్మనీ (2.4 శాతం వృద్ధి)గా ఉన్నాయి. పొరుగు దేశమైన చైనా దిగుమతులు 15.2 శాతం క్షీణించగా, భారత్‌లో 1.1 శాతం దిగువకు పడిపోయాయి. 20.4 శాతం మార్కెట్ వాటాతో సామ్‌సంగ్ మొదటి స్థానంలో నిలపడగా, హ్యువాయి(14.9 శాతం), యాపిల్ (13.4 శాతం), షియామీ(9.6 శాతం), ఒప్పో(8.9 శాతానికి) పెరిగాయి.

1539
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles