20 నెలల కనిష్ఠానికి పారిశ్రామికం

Sat,April 13, 2019 02:29 AM

India February industrial output edges up 0.1 percent

-ఫిబ్రవరిలో 0.1 శాతంగా నమోదు
న్యూఢిల్లీ, ఏప్రిల్ 12: పారిశ్రామిక పరుగులకు బ్రేకులు పడ్డాయి. గడిచిన కొన్ని నెలలుగా దూసుకుపోయిన పారిశ్రామిక రంగంలో మళ్లీ నిస్తేజం నెలకొన్నది. తయారీ రంగం దెబ్బకు ఫిబ్రవరి నెలలో వృద్ధిరేటు 20 నెలల కనిష్ఠ స్థాయి 0.1 శాతానికి పడిపోయింది. ఈ విషయం కేంద్ర గణాంకాల శాఖ వెల్లడించింది. క్రితం ఏడాది ఇదే నెలలో ఐఐపీ వృద్ధి 6.9 శాతంగా ఉన్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-ఫిబ్రవరి మధ్యకాలానికి కూడా పారిశ్రామిక ఉత్పత్తిలో వృద్ధి 4 శాతానికి పరిమితమైంది. అంతక్రితం ఏడాది ఇది 4.3 శాతం. గతేడాది నవంబర్ నెలకుగాను విడుదలైన గణాంకాలను 0.3 శాతానికి బదు లు 0.2 శాతానికి కుదించింది. జూన్ 2017 లో నమోదైన 0.3 శాతం ఇప్పటి వరకు ఇదే కనిష్టం.

పారిశ్రామిక రంగంలో 77.63 శాతం వాటా కలిగిన తయారీ రంగం 0.3 శాతానికి పరిమితికావడంతో మొత్తం గణాంకాలపై ప్రభావం చూపాయని నివేదిక అభిప్రాయపడింది. ఫిబ్రవరి 2018లో నమోదైన 8.4 శాతంతో పోలిస్తే భారీగా పడిపోయింది. క్యాపిటల్ గూడ్స్ ఉత్పత్తి కూడా 16.6 శాతం నుంచి 8.8 శాతానికి పడిపోయింది. ఇంధన రంగ పనితీరు మందకొడిగా నమోదైంది. గతేడాది ఫిబ్రవరిలో 4.5 శాతంగా ఉన్న వృద్ధి ఈసారికిగాను 1.2 శాతానికి పరిమితమైంది. కానీ, గనుల రంగం ఆశాజనక పనితీరును కనబరిచింది. ఈ రంగ వృద్ధి 2 శాతంగా నమోదైంది. అలాగే ప్రాథమిక వస్తువులో వృద్ధి 1.2 శాతంగా ఉండగా, మధ్యంతర వస్తువుల వృద్ధి ప్రతికూలంగా -4.9 శాతంగాను, మౌలిక/నిర్మాణ రంగ పరికరాల ఉత్పత్తిలో 2.4 శాతం పెరుగుదల కనిపించింది. వినియోగదారుల వస్తువులు, కన్జ్యూమరేత వస్తువుల్లో రికార్డు స్థాయి పనితీరు కనబరిచాయి. 23 రంగాల్లో కేవలం 10 మాత్రం సానుకూల వృద్ధిని నమోదు చేసుకోగా, మిగతా 13 ప్రతికూలానికి జారుకున్నాయి.

561
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles