ఈ ఏడాది 40 శాతం వృద్ధి

Mon,June 10, 2019 12:23 AM

India Brazil Canada biz to drive growth says Natco Pharma Rajeev Nannapaneni

-నాట్కో ఫార్మా సీఈవో రాజీవ్
హైదరాబాద్, జూన్ 9: భారత్‌తోపాటు బ్రెజిల్, కెనడా మార్కెట్లపై ప్రముఖ ఫార్మా సంస్థ నాట్కో భారీ అంచనాలు పెట్టుకున్నది. ఈ మూడు దేశాల నుంచి ఆశించిన స్థాయిలో ఆదాయం సమకూరనుండటంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 30 శాతం నుంచి 40 శాతం మధ్యలో వృద్ధి నమోదవనున్నదని నాట్కో ఫార్మా వైస్-చైర్మన్, సీఈవో రాజీవ్ నన్నపనేని తెలిపారు. వీటిలో భారత మార్కెట్లో వృద్ధి 15 శాతం నుంచి 20 శాతం మధ్యలో ఉంటుందని చెప్పారు. ఇప్పటి వరకు బ్రెజిల్‌లో భారీ స్థాయిలో ఔషధాలను ప్రవేశపెట్టినప్పటికీ ఆశించిన స్థాయిలో వృద్ధిని నమోదు చేసుకోలేక పోయామని, కానీ ఈ సారి మాత్రం రెండంకెల వృద్ధిని ఆశిస్తున్నట్లు వాటాదారుల జరిగిన సమావేశంలో ఆయన చెప్పారు. కెనడా మార్కెట్‌పై కూడా ప్రత్యేక దృష్టి సారించడంలో భాగంగా ఇక్కడ కూడా పలు మందులను విడుదల చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ ఏడాది దేశీయ మార్కెట్లోకి 8 నుంచి 10 మందులను విడుదల చేయడానికి సిద్ధమవుతున్న సంస్థ..బ్రెజిల్, కెనడా మార్కెట్లలోకి మూడు నుంచి నాలుగు విడుదల చేయనున్నదన్నారు. మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ఆదాయం రూ.2,242 కోట్ల నుంచి రూ.2,225 కోట్లకు పడిపోగా, నికర లాభంలో కూడా రూ.695 కోట్ల నుంచి రూ.642 కోట్లకు తగ్గింది. వీటిలో దేశీయంగా ఔషధాలను విక్రయించడం ద్వారా రూ.735 కోట్లు సమకూరగా, అదే కెనడా నుంచి రూ.96 కోట్లు, బ్రెజిల్ నుంచి రూ.33 కోట్లు లభించాయి.

429
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles