పెరిగిన ఫారెక్స్ రిజర్వులు

Sat,September 14, 2019 03:06 AM

Increased Forex Reserves

ముంబై, సెప్టెంబర్ 13: విదేశీ మారకం నిల్వలు మరింత పెరిగాయి. సెప్టెంబర్ 6తో ముగిసిన వారంలో ఫారిన్ ఎక్సేంజ్ రిజర్వులు 1.004 బిలియన్ డాలర్లు పెరిగి 429.608 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. విదేశీ మారకం రూపంలో ఉన్న ఆస్తుల విలువ పెరుగడం వల్లనే పెరిగాయని రిజర్వు బ్యాంక్ తాజాగా వెల్లడించింది. అంతక్రితం వారంలో 446 మిలియన్ డాలర్లు తగ్గి 428.604 బిలియన్ డాలర్లకు పడిపోయిన విషయం తెలిసిందే. గత నెలలో ఫారెక్స్ రిజర్వులు రికార్డు స్థాయి 430.572 బిలియన్ డాలర్లకు చేరుకున్నది. గతవారం విషయానికి వస్తే విదేశీ మారకం రూపంలో ఉన్న ఆస్తుల విలువ 1.200 బిలియన్ డాలర్లు పెరిగి 397.205 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. పసిడి రిజర్వులు 199 మిలియన్ డాలర్లు తగ్గి 27.35 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి.

145
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles