పెరిగిన ఫారెక్స్ రిజర్వులు

Sat,April 13, 2019 02:09 AM

Increased Forex reserves

-414 బిలియన్ డాలర్లకు చేరిక
ముంబై, ఏప్రిల్ 12: దేశీయ ఫారెక్స్ రిజర్వులు మరింత పెరిగాయి. ఏప్రిల్ 5తో ముగిసిన వారంలో విదేశీ మారకం రిజర్వులు 1.876 బిలియన్ డాలర్లు పెరిగి 413.781 బిలియన్ డాలర్లకు చేరుకున్నట్లు రిజర్వు బ్యాంక్ విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. అంతక్రితం వారంలో 5.237 బిలియన్ డాలర్లు పెరిగి 411.905 బిలియన్ డాలర్లకు చేరుకున్న విషయం తెలిసిందే. విదేశీ మారకం రూపంలో ఉన్న ఆస్తుల విలువ 2.062 బిలియన్ డాలర్లు ఎగబాకి 386.116 బిలియన్ డాలర్లకు చేరుకున్నట్లు సెంట్రల్ బ్యాంక్ తెలిపింది. ఏప్రిల్ 13, 2018తో ముగిసిన వారంలో ఫారెక్స్ రిజర్వులు రికార్డు స్థాయి 426.028 బిలియన్ డాలర్లకు చేరుకున్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఇప్పటి వరకు 13 బిలియన్ డాలర్లు తగ్గాయి.

247
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles