స్మార్ట్‌ఫోన్లపై పెరిగిన సైబర్‌దాడులు

Fri,July 12, 2019 12:09 AM

Increased cyber attacks on smartphones

హైదరాబాద్, జూలై 11: పర్సనల్ కంప్యూటర్లతోపాటు స్మార్ట్‌ఫోన్లపై కూడా సైబర్‌దాడులు మరింత పెరిగాయి. ఆండ్రాయిడ్ ఆధారిత మొబైళ్లపై సైబర్ దాడులు చేయడం మరింత సులభమని సైబర్ రిస్క్ మానిటర్(సీఆర్‌ఎం) పేరుతో కే7 నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. 51 శాతం వెబ్ ఆధారంగా దాడులు జరుగగా, మిగతా 49 శాతం
మొబైల్, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల ఆధారంగా జరిగాయని తెలిపింది. ఈ సందర్భంగా కే7 కంప్యూటింగ్ సీఈవో పురుషోత్తం మాట్లాడుతూ..సైబర్ సెక్యూరిటీ ప్రస్తుతం ప్రపంచ సమస్యగా మారిందని, ఈ దాడులను నియంత్రించడానికి 25 ఏండ్ల క్రితమే ఈ సేవలను ఆరంభించినట్లు చెప్పారు. స్మార్ట్‌ఫోన్లలో ఉండే యాప్స్ ద్వారా కూడా ఈ దాడులు జరిగే అవకాశం ఉన్నదని, వీటిలో గూగుల్ క్యాలెండర్, గూగుల్ వీడియోప్రో, గూగుల్ యాప్స్, గూగుల్ సర్చ్, గేమ్స్, వీడియో డౌన్‌లోడ్స్ కీలకమని ఆయన వ్యాఖ్యానించారు. గడిచిన ఆర్థిక సంవత్సరంలో రూ.74 కోట్లుగా నమోదైన కంపెనీ టర్నోవర్ ఈసారి రూ.100 కోట్లకు చేరుకునే అవకాశం ఉన్నది. ప్రస్తుతం సంస్థకు భారత్‌లో కోటి మంది వినియోగదారులు భారత్‌లో ఉండగా, జపాన్‌లో కోటిన్నర మంది ఉన్నట్లు తెలిపారు.

460
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles