రియల్ జోష్

Wed,January 9, 2019 12:52 AM

Increase house sales in Hyderabad

- హైదరాబాద్‌లో పెరిగిన ఇండ్ల అమ్మకాలు
- 2018కిగాను విడుదలైన నివేదికలో వెల్లడించిన నైట్ ఫ్రాంక్ ఇండియా

హైదరాబాద్, జనవరి 8: హైదరాబాద్‌లో ఇండ్ల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. నిరుడు హౌజింగ్ సేల్స్ వృద్ధిపథంలో దూసుకెళ్లిన్నట్లు ప్రముఖ ప్రాపర్టీ కన్సల్టెంట్ నైట్ ఫ్రాంక్ ఇండియా తమ తాజా నివేదికలో తెలియజేసింది. హైదరాబాద్‌సహా దేశంలోని ఆరు ప్రధాన నగరాల్లో గతేడాది గృహ విక్రయాలు 6 శాతం పెరిగినట్లు నైట్ ఫ్రాంక్ వెల్లడించింది. నిర్మాణపరమైన అనుమతులు సులభంగా లభించడంతోపాటు రియల్ ఎస్టేట్ సంస్థలు, డెవలపర్లు ధరలను తగ్గించడం, కొనుగోలుదారులను ఆకర్షించడానికి పరోక్షంగా రాయితీల వంటి వాటిని ఆఫర్ చేయడం ఇందుకు దోహదపడినట్లు సంస్థ ఈ సందర్భంగా అభిప్రాయపడింది. ఢిల్లీ-ఎన్‌సీఆర్, ముంబై, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, అహ్మదాబాద్‌ల్లో నివాసాల అమ్మకాలు పెరిగాయని, కోల్‌కతా, పుణెల్లో మాత్రం తగ్గాయని పేర్కొన్నది. ఇక అధిక అమ్మకాలతో అమ్ముడుకాని ఇండ్ల సంఖ్య 11 శాతం పడిపోయి దాదాపు 4.7 లక్షల యూనిట్లకు చేరిందని వివరించింది. కాగా, ఇతర సంస్థలతో పోల్చితే నైట్ ఫ్రాంక్ వృద్ధిరేటు 2018కిగాను తక్కువగా ఉండగా, జేఎల్‌ఎల్ ఇండియా 7 నగరాల్లో 47 శాతం వృద్ధిని, అనరాక్ 16 శాతం పురోగతిని ప్రకటించాయి. మరో సంస్థ ప్రాపర్టీటైగర్ కూడా తొమ్మిది నగరాల్లో ఇండ్ల అమ్మకాల వృద్ధి 25 శాతంగా ఉన్నట్లు చెప్పింది. అయితే ఈ తేడా ఆయా సంస్థలు ఎంచుకున్న నగరాల కారణంగా వచ్చినట్లు తెలుస్తున్నది. ఇకపోతే గతేడాది ఇండ్ల అమ్మకాలు 2,42,328 యూనిట్లుగా ఉన్నట్లు అంచనా. అంతకుముందు ఏడాది 20 17లో 2,28,072 యూనిట్ల అమ్మకాలైయ్యాయి. కాగా, ఏడేం డ్ల తర్వాత దేశీయ రెసిడెన్షియల్ మార్కెట్ తిరిగి పుంజుకున్నదని నైట్ ఫ్రాంక్ ఇండియా సీఎండీ శిశిర్ బైజల్ అన్నారు. వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) రేట్లు తగ్గడం, రియల్టర్లు చౌక గృహాల వైపు అడుగులేస్తుండటం మార్కెట్ సెంటిమెంట్‌ను బలపరిచిందని చెప్పారు. ఈ క్రమంలోనే బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల (ఎన్‌బీఎఫ్‌సీ) సంక్షోభం కూడా కొనుగోళ్లను అడ్డుకోలేకపోయిందని అభిప్రాయపడ్డారు.

ఆఫీస్ స్పేస్‌లో భాగ్యనగరానిదే హవా

ఆఫీస్ లీజింగ్ మార్కెట్‌లో దేశవ్యాప్తంగా భాగ్యనగరానిదే హవా అని నైట్ ఫ్రాంక్ తమ నివేదికలో పేర్కొన్నది. ఇండియా రియల్ ఎస్టేట్ అర్ధ వార్షిక నివేదిక పేరుతో మంగళవారం సంస్థ తమ పదో ఎడిషన్‌ను విడుదల చేసింది. రెసిడెన్షియల్, కమర్షియల్ మార్కెట్లలో హైదరాబాద్.. దేశంలోని మిగిలిన ఏ ప్రముఖ నగరాలకు లేనంత క్రేజ్‌ను సంపాదించుకున్నట్లు ఇందులో తెలిపింది. ముఖ్యంగా దేశ, విదేశీ సంస్థలు తమ వ్యాపార కార్యకలాపాలను హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా నడుపాలన్న ఆసక్తిని కనబరుస్తున్నాయి. ఈ క్రమంలోనే గతేడాది ద్వితీయార్ధం (జూలై-డిసెంబర్ వ్యవధి)లో హైదరాబాద్ ఆఫీస్ లీజింగ్ మునుపెన్నడూ లేనివిధంగా చారిత్రక స్థాయిలను అందుకున్నట్లు నైట్ ఫ్రాంక్ వెల్లడించింది. కార్యాలయాల కోసం ఈ ఆరు నెలల్లో ఏకంగా 4.3 మిలియన్ చదరపు అడుగుల (ఎంఎస్‌ఎఫ్) స్థలం లీజులకు కుదిరిందని వివరించింది. సరఫరా, లీజింగ్ కార్యకలాపాల్లో వరుసగా 19 శాతం, 24 శాతం చొప్పున వృద్ధి నమోదైందని చెప్పింది. ఇదే సమయంలో జాతీయ స్థాయిలోనూ గతేడాది మొత్తంగా రికార్డు స్థాయిలో 46.9 ఎంఎస్‌ఎఫ్ స్థలం ఆఫీస్ లీజింగ్ జరిగిందని పేర్కొన్నది.

సమీప భవిష్యత్తులో దేశంలోని ఇతర నగరాలకు నిర్మాణ రంగంలో హైదరాబాద్ ఓ గొప్ప సవాలే. వృద్ధిరేటు పరంగా హైదరాబాద్‌ను అందుకోవడం అసాధ్యమేనన్నా
అతిశయోక్తి కాదు. ఇప్పటికే ఢిల్లీ ఎన్‌సీఆర్, ముంబై మార్కెట్లకు ధీటుగా లీజింగ్ జరుగుతున్నది. నివాస, వాణిజ్య మార్కెట్లలో జాతీయ స్థాయితో పోల్చితే ఇక్కడి
రియల్ ఎస్టేట్.. మదుపరులను విపరీతంగా ఆకట్టుకుంటున్నది సామ్సన్ ఆర్థర్
-నైట్ ఫ్రాంక్ హైదరాబాద్ శాఖ డైరెక్టర్

2018 జూలై-డిసెంబర్‌లో హైదరాబాద్ కమర్షియల్ మార్కెట్ తీరు

- మునుపెన్నడూ లేనివిధంగా 4.3 ఎంఎస్‌ఎఫ్ లీజింగ్
- మొత్తం ఏడాదిలో 24 శాతం వృద్ధితో 7 ఎంఎస్‌ఎఫ్‌పైనే లీజింగ్
- ఢిల్లీ-ఎన్‌సీఆర్, ముంబై వంటి భారీ మార్కెట్లకు చేరువైన భాగ్యనగరం
- కలిసొచ్చిన సులభతర వ్యాపార విధానాలు, పెట్టుబడులకు అపార అవకాశాలు
- ఆకట్టుకునే మౌలిక సదుపాయాల కల్పనతోనూ పరుగు
- మొత్తం లీజుల్లో ఐటీ, ఐటీ అనుబంధ రంగాల వాటానే 44 శాతం
- తయారీ రంగం వాటా 26 శాతం, ఇతర సేవల రంగం వాటా 29 శాతం
- గతంతో పోల్చితే 70 శాతం పెరిగి దాదాపు 2 ఎంఎస్‌ఎఫ్‌కు చేరిన కొత్త లీజులు
- మొత్తం ఏడాదిలో 19 శాతం వృద్ధి చెంది 4 ఎంఎస్‌ఎఫ్‌గా నమోదు

2018 జూలై-డిసెంబర్‌లో హైదరాబాద్ రెసిడెన్షియల్ మార్కెట్ తీరు

- రెరా రాకతో నూతన ఉత్సాహం
- గతేడాదితో పోల్చితే 15 శాతం పెరిగి 7,278 యూనిట్ల అమ్మకాలు
- 2018 మొత్తంగా దాదాపు 10 శాతం వృద్ధితో 15,591 యూనిట్ల విక్రయాలు
- రాష్ట్ర విభజన నేపథ్యంలో పెరిగిన రియల్ ఎస్టేట్ డిమాండ్
- ప్రభుత్వ విధానాలు, స్థిరమైన పాలనతో కొనుగోలుదారుల్లో పెరిగిన ఆసక్తి
- నగర
- మధ్యతరగతివారికి అందుబాటులో ధరలు
- 81 శాతం వృద్ధితో అందుబాటులోకి దాదాపు 1,700 కొత్త యూనిట్లు
- మొత్తం ఏడాదిలో 54 శాతం పుంజుకుని 5,404కు చేరిన కొత్త ఇండ్లు
- నూతన నిర్మాణాలు, ప్రాజెక్టుల్లో నగరంలోని పశ్చిమ ప్రాంతం వాటానే 84 శాతం
- కొత్త వాటిలో 43 శాతం చౌక, మధ్యశ్రేణి గృహాలే (ధర రూ.50 లక్షల వరకు)
- ఆసక్తికరంగా రూ.5-7.5 లక్షల ధరల శ్రేణిపై రియల్టర్ల దృష్టి

1398
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles