ప్రిస్టేజ్ ప్రత్యేక ఆఫర్ల గడువు పెంపు

Wed,October 23, 2019 04:54 AM

బెంగళూరు, అక్టోబర్ 22: గృహోపకరణాల విక్రయంలో అగ్రగామి సంస్థయైన టీటీకే ప్రిస్టేజ్...ప్రస్తుత పండుగ సీజన్‌లో ప్రకటించిన ప్రత్యేక డిస్కౌంట్ ఆఫర్‌ను నవంబర్ 28 వరకు పొడిగించింది. శుభుత్సవ్ పేరుతో ప్రకటించిన ఈ ఆఫర్లకింద గృహోపకరణాలు 79 శాతం రాయితీకే విక్రయిస్తున్నది. ఈ సందర్భంగా కంపెనీ ప్రతినిధి దినేశ్ గార్గ్ మాట్లాడుతూ..కొనుగోలుదారులకు ఆర్థిక ప్రయోజనాలు కల్పించడానికి కంపెనీ ఎప్పుడూ కృషి చేస్తున్నదని, ప్రస్తుత పండుగ సీజన్‌లో ప్రకటించిన ఆఫర్లకు వినియోగదారుల నుంచి వస్తున్న విశేష ఆదరణతో ఈ గడువును పొడిగించాల్సి వచ్చిందన్నారు. ఈ ఆఫర్లలో భాగంగా 3,200 ధర కలిగిన ఒమెగా డీలక్స్ 3 పీస్‌ల నాన్-స్టిక్ కుక్‌వేర్‌ను కొనుగోలు చేసిన వారికి 68 శాతం రాయితీ ఇస్తున్నది. అలాగే 10,895 విలువైన ఎడ్జ్ గ్లాస్ టాప్‌ను కొనుగోలు చేసిన వారికి 6,720 విలువైన ఇతర ఉత్పత్తులను ఉచితంగా అందిస్తున్నది సంస్థ.

344
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles