ఇక ఫేస్‌లెస్ ఈ-అసెస్‌మెంట్

Tue,October 8, 2019 12:27 AM

-ట్యాక్స్‌పేయర్ల కోసం ప్రారంభించిన ఐటీ శాఖ
న్యూఢిల్లీ, అక్టోబర్ 7: ఆదాయం పన్ను (ఐటీ) శాఖ సోమవారం ఫేస్‌లెస్ ఈ-అసెస్‌మెంట్ స్కీంను ప్రారంభించింది. రెవిన్యూ కార్యదర్శి అజయ్ భూషణ్ పాండే దీన్ని ఇక్కడ అధికారికంగా ఆవిష్కరించారు. నిజానికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ దీన్ని ప్రారంభించాల్సి ఉన్నది. అయితే ప్రధాన మంత్రితో భేటీ, మరికొన్ని కీలక సమావేశాల కారణంగా ఆమె ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోయారు. కాగా, మదింపు అధికారులకు, ట్యాక్స్‌పేయర్‌కు మధ్య సమన్వయానికి ఈ నూతన విధానం దోహదపడగలదని ఐటీ శాఖ భావిస్తున్నది. ఈ కొత్త పథకం కోసం 58,322 ఐటీ కేసులను పరిశీలనార్థం అధికారులు ఎంపిక చేశారు. పన్ను చెల్లింపుదారుల సౌకర్యార్థమే దీన్ని అందుబాటులోకి తెచ్చామని పాండే ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్నారు.

208
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles