ఖతాదారులకు మెరుగైన సేవలు: బీవోబీ

Mon,August 19, 2019 03:15 AM

హైదరాబాద్, ఆగస్టు 18: ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించడానికి తమ పనితీరును మెరుగుపరుచుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రభుత్వరంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ) ప్రకటించింది. ఆర్థిక వృద్ధితోపాటు మౌలిక సదుపాయాలు, పారిశ్రామిక, వ్యవసాయ, ఎంఎస్‌ఎంఈ, విద్యా, ఎగుమతులు, మహిళా సాధికారిత లక్ష్యంగా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు బీవోబీ హైదరాబాద్ జనరల్ మేనేజర్ పీ శ్రీనివాస్ తెలిపారు. బ్రాంచ్‌ల పనితీరుపై రెండురోజులపాటు జరిగిన సమావేశం ఆదివారం ముగిసింది. ఎన్‌పీఏలను తగ్గించడంలో ప్రాంతీ య శాఖలు కీలకపాత్ర పోషించాయని, ఇవి ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను పరిష్కరించడానికి బ్యాంక్ ఎల్లప్పుడు సిద్ధంగా ఉన్నట్లు ఆయన ఈ సందర్భంగా ప్రకటించారు. నూతన సేవలు అందించడంలోభాగంగా టెక్నాలజీ రంగానికి పెద్దపీట వేయనున్నట్లు ప్రకటించిన బ్యాంక్..రైతులు, చిన్నస్థాయి వ్యాపారవేత్తలు, యువత, విద్యార్థులు, మహిళల అవసరాలనిమిత్తం సేవలను విసృత పరుచనున్నట్లు చెప్పారు. నగదు బదిలీ, నగదు రహిత సేవలు, డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడానికి బ్యాంక్ అన్ని విధాలుగా కృషి చేస్తున్నదని ఆయన పేర్కొన్నారు.

384
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles