అంత కాదు.. ఇంతే!

Wed,July 24, 2019 04:54 AM

IMF cuts India growth forecast

-దేశ జీడీపీ అంచనాల్ని తగ్గించిన ఐఎంఎఫ్

వాషింగ్టన్, జూలై 23: దేశ జీడీపీ అంచనాలను అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) మంగళ వారం తగ్గించింది. ఇంతకుముందుతో పోల్చి తే ఈ ఏడాది, వచ్చే ఏడాది రెండేండ్లకుగాను 0.3 శాతం చొప్పున అంచనాల్లో కోత పెట్టింది. ఊహించిన దానికంటే దేశీయ డిమాండ్ ముఖచిత్రం బలహీనంగా ఉందంటూ ఈ ఏడాది (2019) జీడీపీని 7 శాతానికి, వచ్చే ఏడాది (2020) జీడీపీని 7.2 శాతానికి పరిమి తం చేసింది. గతంలో ఇవి వరుసగా 7.3 శాతం, 7.5 శాతంగా ఉన్నాయి. అయిన ప్పటికీ ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన వృద్ధిరేటును కలిగిన దేశాల్లో భారత్‌దే ప్రథమ స్థానం కాగలదని చెప్పింది. ప్రపంచ, కీలక దేశాల ఆర్థిక వ్యవస్థల తీరుతెన్నులపై తాజా నివేదికను చిలీ రాజధాని శాంటియాగో నగరంలో ఐఎంఎఫ్ విడుదల చేసింది. ఈ సందర్భంగా ప్రపంచ జీడీపీ అంచనాను కూడా ఈ రెండేండ్లు 0.1 శాతం మేర తగ్గిస్తున్నట్లు ఐఎంఎఫ్ ప్రధాన ఆర్థికవేత్త, భారత సంతతికి చెందిన గీతా గోపీనాథ్ స్పష్టం చేశారు. ఈ ఏడాదికి 3.2 శాతంగా, వచ్చే ఏడాదికి 3.5 శాతంగా గ్లోబల్ ఎకానమీ వృద్ధిని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. ఇక 2019కి 6 శాతంగా, 2020కి 6.1 శాతంగా ఐఎంఎఫ్ చైనా జీడీపీని అంచనా వేసింది. ఈ ఏప్రిల్‌లో విడుదల చేసిన అంచనాలతో పోల్చితే 0.1 శాతం చొప్పున తగ్గాయి.

230
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles