2017లోనే బయటపడేది

Mon,June 10, 2019 12:16 AM

IL and FS fraud Whistleblower sought to uncover it in 2017 but top brass covered it up

-ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ మోసంపై ఎస్‌ఎఫ్‌ఐవో
న్యూఢిల్లీ, జూన్ 9: ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ కుంభకోణం 2017లోనే బయటపడేదని ఈ కేసును విచారణ చేస్తున్న తీవ్ర మోసాల దర్యాప్తు కార్యాలయం (ఎస్‌ఎఫ్‌ఐవో) తెలిపింది. సంస్థలో ఎప్పట్నుంచో మోసాలు జరుగుతున్నాయని, దీనిపై వచ్చిన విజిల్ బ్లోవర్ ఫిర్యాదును స్వతంత్ర డైరెక్టర్లతో కలిసి యాజమాన్యం తొక్కిపట్టిందని ఎస్‌ఎఫ్‌ఐవో అధికారులు చెప్పారు. ఈ మేరకు తమ దర్యాప్తులో వెల్లడైందన్నారు. అడుగడుగునా నిర్లక్ష్యం పేరుకుపోయిందని, బకాయిల వసూళ్లను కావాలనే ఆలస్యం చేశారని వివరించారు. 2017 మార్చిలో విజిల్ బ్లోవర్ నుంచి ఫిర్యాదు అందితే దానిపై ఆ ఏడాది డిసెంబర్‌లో ఆడిటింగ్ కమిటీ చర్చ చేపట్టిందని అన్నారు. యాజమాన్యంతో ఆడిటర్లూ కుమ్మక్కై కుట్రకు తెరతీసినట్లు ఎస్‌ఎఫ్‌ఐవో దర్యాప్తులో అధికారులు గుర్తించారు. దేశీయ బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్‌బీఎఫ్‌సీ)ల రంగాన్ని ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ కుంభకోణం కుదిపేయగా, ఇది గతేడాది వెలుగుచూసిన విషయం తెలిసిందే. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ గ్రూప్ రూ.90,000 కోట్లకుపైగా రుణ భారాన్ని మోస్తుండగా, గ్రూప్‌లోని పలు సంస్థలు చెల్లింపుల్లో వరుసగా వైఫల్యమవుతున్న క్రమంలో మోసం సంగతి బయటికొచ్చింది.

678
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles