ఐసీఐసీఐ బ్యాంక్ నుంచి ఎఫ్‌డీ ఎక్స్‌ట్రా

Sun,February 17, 2019 12:52 AM

ICICI Bank introduces FD Xtra, a range of innovative term deposits

ముంబై, ఫిబ్రవరి 16: సాధారణ డిపాజిట్ల కన్నా అదనపు ఫీచర్లతో ఐసీఐసీఐ బ్యాంక్ ఎఫ్‌డీ ఎక్స్‌ట్రా పేరుతో కొత్తగా ఫిక్స్‌డ్, టర్మ్ డిపాజిట్ పథకాలను ఆరంభించింది. ఇటీవలి తాత్కాలిక బడ్జెట్‌లో వడ్డీ ఆదాయం రూ. 40,000 వరకూ టీడీఎస్ నుంచి మినహాయించిన నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఫిక్స్‌డ్ డిపాజిట్లకు మొగ్గు చూపే విధంగా ఈ డిపాజిట్ స్కీమ్‌లను రూపొందించినట్టు ఐసీఐసీఐ బ్యాంక్ రిటైల్ లయబిలిటీస్ గ్రూప్ హెడ్ ప్రణవ్ మిశ్రా తెలిపారు. టర్మ్ ఇన్సూరెన్స్, వివిధ రుణాలకు డౌన్ పేమెంట్ అవసరాలు, పదవీ విరమణ ప్రణాళిక, పిల్లల చదువు, విహార యాత్రల వంటి అవసరాలను తీర్చే విధంగా ఈ డిపాజిట్ స్కీములను రూపొందించినట్టు తెలిపారు. ఫైనాన్షియల్ మార్కెట్లలో ప్రస్తుతం ఉన్న నేపథ్యంలో వినియోగదారులు మళ్లీ ఫిక్స్‌డ్ డిపాజిట్ల వైపు మొగ్గుచూపుతారని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు.

ఎఫ్‌డీ లైఫ్ డిపాజిట్లతో వినియోగదారులకు టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజిని గరిష్ఠంగా రూ. 3 లక్షల వరకూ ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఇన్సూరెన్స్ అందిస్తుండగా, ఎఫ్‌డీ ఇన్వెస్ట్ డిపాజిట్‌లో వచ్చే వడ్డీని నెలనెలా ఎస్‌ఐపీ రూపంలో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్లలో మదుపు చేసే అవకాశాన్ని కల్పిస్తున్నట్టు తెలిపారు. ఎఫ్‌డీ ఇన్‌కమ్ డిపాజిట్లలో వినియోగదారులు తమ అవసరాలకు అనుగుణంగా మెచ్యూరిటీ కాలపరిమితి నిర్ణయించుకునే విధంగా ఎఫ్‌డీ, రికరింగ్ డిపాజిట్లను చేయవచ్చునని తెలిపారు.

1099
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles