సమీక్షించిన ఐబీఏ

Sun,February 18, 2018 12:54 AM

IBA Notice of review of IBA structure International Bar Association

పీఎన్‌బీలో జరిగిన భారీ కుంభకోణంపై బ్యాంకర్ల సంఘం ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్(ఐబీఏ) కూలంకశంగా చర్చించింది. ఈ సమావేశానికి ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులకు చెందిన ఉన్నతాధికారులు హాజరైనట్లు విభిన్న వర్గాల ద్వారా తెలిసింది. తొలుత ఈ సమావేశంలో దక్షిణ ముంబైలోని ఐబీఏ ప్రధాన కార్యాలయంలో జరుగాల్సి ఉండగా, చివరి నిమిషంలో ఈ భేటిని ఎస్‌బీఐ హెడ్‌క్వార్టర్‌కు మారింది. కుంభకోణంపై జరుగుతున్న సమావేశం కావడంతో మీడియాను అనుమతించలేదు. అలహాబాద్ బ్యాంక్ ఎండీ, సీఈవో, ఐబీఏ చైర్‌పర్సన్ ఉషా అనంత సుబ్రమణియన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎండీ, సీఈవో దీనబంధు మోహపాత్రా, ఐసీఐసీఐ బ్యాంక్ చీఫ్ ఫైనాన్షియల్ అధికారి ఎన్‌ఎస్ కన్నన్, ఐబీఏ డిప్యూటీ చీఫ్ ఎగ్జిక్యూట్ బీ రాజ్‌కుమార్ హాజరయ్యారు. ఈ కుంభకోణానికి పాల్పడిన వారి నుంచి ఎలా రుణాలు వసూలు చేసేదానిపై ప్రధానంగా చర్చించినట్లు ఓ ప్రముఖ బ్యాంకర్ వెల్లడించారు.

275
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles