హ్యుందాయ్ ఎక్సెంట్‌లో కొత్త వెర్షన్


Fri,April 21, 2017 12:30 AM

గరిష్ఠ ధర రూ.8.41 లక్షలు
న్యూఢిల్లీ, ఏప్రిల్ 20: సరికొత్త హంగులతో రూపొందించిన కాంప్యాక్ట్ సెడాన్ ఎక్సెంట్‌ను దేశీయ మార్కెట్లోకి విడుదల చేసినట్లు ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ హ్యుందాయి మోటార్ ప్రకటించింది. ఈ కారు రూ.5.38 లక్షల నుంచి రూ.8.41 లక్షల మధ్యలో లభించనున్నది. ఈ ధరలు ఢిల్లీ షోరూంకు సంబంధించినవి.
Xcent
పెట్రోల్ విభాగంలో ఆరు రకాల్లో లభించనున్న ఈ కారు రూ.5.38-7.51 లక్షల మధ్యలోను నిర్ణయించిన సంస్థ.. డీజిల్ విభాగంలో లభించనున్న ఐదు రకాల కార్లు రూ.6.28-8.41లక్షల మధ్యలో లభించనున్నది. అత్యధిక వేగంగా మారుతున్న ట్రెండ్‌కు తగ్గట్టుగా ఈ కారును రూపొందించినట్లు, ముఖ్యంగా వినియోగదారుల అభిరుచి మేరకు పలు మార్పులు చేసినట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. 2014లో దేశీయ మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చిన ఈ కారు ఇప్పటి వరకు 2.5 లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయి.

322

More News

VIRAL NEWS