హైదరాబాద్ ఎయిర్‌పోర్టుకు అవార్డ్

Sat,January 12, 2019 12:00 AM

Hyderabad Rajiv Gandhi International Airport bags award

హైదరాబాద్, జనవరి 11: ప్రతిష్ఠాత్మక ఐసీఎస్‌ఐ సీఎస్‌ఆర్ ఆవార్డును జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్‌పోర్డు దక్కించుకుంది. ముంబైలో జరిగిన ఒక కార్యక్రమంలో సెబీ మాజీ ఛైర్మన్ జీఎన్ బాజ్‌పాయ్, ఇండియా ప్రొఫెషనల్ ఫోరమ్ అధ్యక్షుడు డాక్టర్ మోహన్ కౌల్ చేతులు మీదుగా ఎయిర్‌పోర్ట్ ఛీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ రాజేశ్ అరోరా ఈ అవార్డును అందుకున్నారు. సీఎస్‌ఆర్ కింద జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ పరిసర గ్రామాల్లో జీవన ప్రమాణాలు మెరుగుదల, సామాజిక మౌలిక వసతుల కోసం చేపడుతున్న కార్యక్రమాలకు గుర్తింపుగా ఈ అవార్డు దక్కింది. తమకు ఈ అవార్డు దక్కినందుకు గర్వంగా ఉందని జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్ సీఈవో ఎస్‌జీకే కిశోర్ అన్నారు. సీఎస్‌ఆర్ కార్యక్రమాలు ద్వారా సామాజిక సుస్థిరాభివృద్దికి దోహదపడుతాయని ఆయన్న పేర్కొన్నారు.

758
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles