హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో క్లౌడ్ ఆధారిత ఇరిగేషన్

Wed,September 11, 2019 02:39 AM

Hyderabad airport gets cloud-based automatic irrigation system

- దేశంలోనే ప్రప్రథమం
- మొబైల్, కంప్యూటర్లతో కంట్రోల్


శంషాబాద్, సెప్టెంబర్ 10: పర్యావరణహిత కార్యక్రమాలకు సాంకేతిక పరిజ్ఞానం ద్వారా మరింత ప్రోత్సాహమిస్తున్నారు. జీఎంఆర్ ఆధ్వర్యంలోని హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం (శంషాబాద్)లో క్లౌడ్ ఆధారిత ఆటోమేటిక్ ఇరిగేషన్ సిస్టంను మంగళవారం ప్రారంభించారు. ఈ వ్యవస్థను దేశంలో ప్రప్రథమంగా శంషాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులోనే ఏర్పాటు చేయడం గమనార్హం. ఎయిర్‌పోర్టు టెర్మినల్ సమీపంలోని 80 ఎకరాల చెట్లు, మొక్కల కోసం 8.4 కిలోమీటర్ల ప్రధాన రహదారి పొడవునా నీటి పారుదల వ్యవస్థ నియంత్రణకు ఇరిగేషన్ మేనేజ్‌మెంట్ అండ్ మానిటరింగ్ సాఫ్ట్‌వేర్ రూపొందించారు. మొబైల్ ఫోన్లు, ట్యాబ్‌లెట్లు, ల్యాప్ టాప్‌లు, కంప్యూటర్ల ద్వారా ఈ నీటిపారుదల వ్యవస్థను నియంత్రిస్తారు. సాధారణ నీటిపారుదల వ్యవస్థతో పోల్చితే 35 శాతం నీరు ఆదా అవుతుందని నిపుణులు, నిర్వాహకులు వివరించారు. ఈ సందర్భంగా ఎయిర్‌పోర్టు సీఈవో ఎస్‌జీకే కిశోర్ మాట్లాడుతూ పర్యావరణ స్పృహ కలిగిన సంస్థగా మేము సహజ వనరులను పరిరక్షించడానికి నిరంతర నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకునేందుకు కృషి చేస్తున్నాం అన్నారు. విమానాశ్రయంలో క్లౌడ్ ఆధారిత ఆటోమేటిక్ ఇరిగేషన్ సిస్టం ముఖ్యమైనదన్న ఆయన ఇంటర్నెట్ ఉపకరణాల ద్వారా దీన్ని నియంత్రిస్తున్నామని వివరించారు.

384
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles