హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో మరో 26 పార్కింగ్ స్టాండ్స్

Wed,January 9, 2019 11:46 PM

Hyderabad airport adds 26 aircraft parking stands

హైదరాబాద్, జనవరి 9: శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో మరో 26 ఎయిర్‌క్రాఫ్ట్ పార్కింగ్ స్టాండ్స్‌ను అందుబాటులోకి తెచ్చింది జీఎమ్మార్ సంస్థ. తద్వారా శరవేగంగా కొనసాగుతున్న విస్తరణ పనుల్లో మరో మైలురాయిని అధిగమించింది. కొత్తవి అందుబాటులోకి రావడంతో మొత్తం పార్కింగ్ స్టాండ్ల సంఖ్య 83కు చేరింది. ఈ మేరకు బుధవారం జీఎమ్మార్ కమ్యూనికేషన్స్ అధికార వర్గాలు ఒక ప్రకటన విడుదల చేశాయి. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కొత్త ఎయిర్‌క్రాఫ్ట్ స్టాండ్ల నిర్మాణంతో 45 శాతానికిపైగా హ్యాండ్లింగ్ సామర్థ్యం పెరుగుతున్నదన్నాయి. దాదాపు 65 వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో 10 నెలల్లో ఈ స్టాండ్స్ నిర్మాణం పూర్తిచేశారు. 20 శాతం మేర పెరిగిన ప్రయాణీకులకు అనుగుణంగా విస్తరణ, స్టాండ్ల వినియోగం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని సీఈవో కిశోర్ తెలిపారు.

580
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles