తాజ్ జీవీకే లాభంలో భారీ వృద్ధి

Sat,November 9, 2019 02:18 AM

హైదరాబాద్, నవంబర్ 8: ఆతిథ్య సేవలు అందిస్తున్న తాజ్ జీవీకే హోటల్స్ అండ్ రిసార్ట్స్ లిమిటెడ్ అంచనాలకుమించి ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. సెప్టెంబర్ 30తో ముగిసిన మూడు నెలల్లో రూ.14.79 కోట్ల ఆదాయంపై రూ.3 కోట్ల నికర లాభాన్ని గడించింది. గతేడాది ఇదే సమయంలో నమోదైన రూ.11.65 కోట్ల ఆదాయంతో పోలిస్తే 27 శాతం వృద్ధిని కనబరుచగా, రూ.1.28 కోట్ల నికర లాభంతో పోలిస్తే 234 శాతం ఎగబాకింది. ఈ సందర్భంగా కంపెనీ చైర్మన్ జీవీకే రెడ్డి మాట్లాడుతూ..2020 నాటికి దేశవ్యాప్తంగా ఉన్న అన్ని మెట్రో నగరాలకు తన వ్యాపారాన్ని విస్తరించనున్నట్లు ప్రకటించారు. అలాగే కంపెనీ రుణ భారం రూ.179 కోట్లకు తగ్గించుకున్నట్లు చెప్పారు. హైదరాబాద్‌లో ఉన్న తాజ్‌కృష్ణ హోటల్ విస్తరణ పనులు చురుగ్గాసాగుతున్నాయని, వచ్చే నెల చివరినాటికి 44 గదులు అందుబాటులోకి రానున్నాయి.

113
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles