ప్రత్యేక ఎడిషన్‌గా హోండా సిటీ

Fri,January 12, 2018 12:44 AM

Honda launches special edition City Amaze and WR V

మరో రెండు కార్లు కూడా..
honda-city
న్యూఢిల్లీ, జనవరి 11: ప్రముఖ కార్ల తయారీ సంస్థ హోండా.. ప్రత్యేక ఎడిషన్లుగా ఒకేసారి మూడు కార్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. వీటిలో సిటీ, అమేజ్, డబ్ల్యూఆర్-వీ ఉన్నాయి. 20వ వార్షికోత్సవ ఎడిషన్‌గా విడుదల చేసిన హోండా సిటీ పెట్రోల్ ఆటోమేటిక్ వెర్షన్ ధర రూ.13,74,532గాను, డీజిల్ రకం రూ.13,82,382గా నిర్ణయించింది. అలాగే అమేజ్ ప్రైడ్ పెట్రోల్ రకం రూ.6,29,900, డీజిల్ మోడల్ రూ.7,83,486గాను, డబ్ల్యూఆర్-వీ పెట్రోల్ రకం రూ.8,01,017, డీజిల్ మోడల్‌ను రూ.9,04,683కు విక్రయించనున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ ధరలు ఢిల్లీ షోరూంకు సంబంధించినవి.

380
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles