రాష్ట్ర మార్కెట్లోకి హోండా గ్రాజియా

Tue,November 14, 2017 12:20 AM

Honda Grazia 125cc scooter launched in India at Rs 57897

ధర రూ.59,525
honda
హైదరాబాద్, నవంబర్ 13: ద్విచక్ర వాహన తయారీలో అగ్రగామి సంస్థ హోండా..రాష్ట్ర మార్కెట్లోకి మరో స్కూటర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. గ్రాజియా పేరుతో విడుదల చేసిన ఈ స్కూటర్ హైదరాబాద్ షోరూంలో రూ.59,525లకు లభించనున్నది. ఈ సందర్భంగా హెచ్‌ఎంఎస్‌ఎల్ జోనల్ మేనేజర్ సుభాష్ మాట్లాడుతూ..ప్రస్తుతం ద్విచక్ర వాహనాల్లో స్కూటర్ల అమ్మకాలు టాప్‌గేర్‌లో దూసుకుపోతున్నాయని చెప్పారు. 125 సీసీ సామర్థ్యంతో రూపొందించిన ఈ స్కూటర్ లీటర్ పెట్రోల్‌కు 30-40 కిలోమీటర్ల వరకు మైలేజీ ఇవ్వనున్నదన్నారు. ఎల్‌ఈడీ హెడ్‌లైట్, తొలిసారిగా మొబైల్ చార్జర్, ప్రీమియం బైకుల ఉండే ఫ్రంట్ డిస్క్ బ్రేక్ వంటి అధునాతన ఫీచర్స్‌తో ఈ స్కూటర్‌ను రూపొందించినట్లు చెప్పారు.

215
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS