హోండా నుంచి సీబీ300ఆర్

Sat,February 9, 2019 12:18 AM

Honda CB300R launched at Rs 2.41 lakh

-ధర రూ.2.41 లక్షలు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 8: జపాన్‌కు చెందిన ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా(హెచ్‌ఎంఎస్‌ఐ)..దేశీయ మార్కెట్లోకి మరో మధ్యశ్రేణి బైకును అందుబాటులోకి తీసుకొచ్చింది. సీబీ300ఆర్ పేరుతో విడుదల చేసిన ఈ బైకు ధరను రూ.2.41 లక్షలుగా నిర్ణయించింది. 286 సీసీ సామర్థ్యంతో రూపొందించిన ఈ బైకు రెండో నియో స్పోర్ట్స్ కేఫ్ అని తెలిపింది. వినియోగదారులు అంచనాలమేరకు ఈ నూతన సెగ్మెంట్‌లోకి ప్రవేశించినట్లు, అంతర్జాతీయ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ నూతన బైకును విడుదల చేసినట్లు కంపెనీ వైస్ ప్రెసిడెంట్ యద్వీందర్ సింగ్ గులేరియా తెలిపారు.

1092
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles