బ్రియో ఉత్పత్తిని నిలిపివేసిన హోండా

Mon,February 11, 2019 12:34 AM

Honda Brio production stopped

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 10: జపాన్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ హోండా.. ఎంట్రిలెవల్ హ్యాచ్‌బ్యాకైన బ్రియో కార్ల ఉత్పత్తిని భారత్‌లో నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. గడిచిన 17 ఏండ్లుగా భారత్‌లో ఉత్పత్తి చేసిన ఈ కారుకు అంతగా డిమాండ్ లేకపోవడం వల్లనే సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది. కంపెనీకి చెందిన కాంప్యాక్ట్ సెడాన్ అమేజ్ అమ్మకాలు టాప్‌గేర్‌లో దూసుకుపోతుండటం ఇదే ఎంట్రిలెవల్‌గా మారడంతో బ్రియో ఉత్పత్తిని నిలిపివేసినట్లు హోండా కార్స్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్, డైరెక్టర్(మార్కెటింగ్) రాజేష్ గోయెల్ తెలిపారు. మళ్లీ బ్రియోను ప్రవేశపెట్టే ఉద్దేశం మాత్రం సంస్థకు లేదని ఆయన స్పష్టంచేశారు. వినియోగదారుల అభిరుచులు మారుతున్నాయని, ముఖ్యంగా చిన్న వాటి కంటే పెద్ద మోడళ్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారన్నారు. గతేడాది దేశవ్యాప్తంగా సెడాన్ కార్లు అత్యధికంగా అమ్ముడయ్యాయని, ఇతర దేశాలతోపోలిస్తే భారత్‌లో కార్ల మార్పిడి వేగవంతంగా జరుగుతున్నదని ఆయన అభిప్రాయపడ్డారు. గతంలో ఆరు నుంచి ఏడేండ్లలో కారును మార్చేవారు, కానీ ప్రస్తుతం మూడు నుంచి నాలుగేండ్లకు మించి ఉంచుకోవడం లేదని ఆయన చెప్పారు.

870
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles