హెటిరో నుంచి రొమ్ము క్యాన్సర్ మందు

Fri,January 11, 2019 11:47 PM

Hetero launches generic breast cancer treatment drug in India

హైదరాబాద్, జనవరి 11: రాష్ర్టానికి చెందిన ఔషధాల తయారీ సంస్థ హెటిరో డ్రగ్..రొమ్ము క్యాన్సర్ వ్యాధిని నిర్మూలించే ఔషధానికి ప్రత్యామ్నాయంగా జనరిక్ వెర్షన్ లాపాటినిబ్ ట్యాబ్లెట్లను దేశీయ మార్కెట్లోకి విడుదల చేసింది. హెర్టాబ్ బ్రాండ్ కింద లభించనున్న ఈ ఔషధం 250 ఎంజీల్లో దొరకనున్నదని కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ ఔషధాన్ని దేశీయంగా మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్‌ను హెటిరో హెల్త్‌కేర్ లిమిటెడ్ నిర్వహిస్తున్నది. ఇందుకోసం సంస్థ రెండు ఎస్‌కేయూఎస్‌లను సిద్ధంగా ఉంచింది. క్యాన్సర్ సెల్స్‌ను నియంత్రించడానికి కెపెసిటాబిన్ లేదా లెట్రోజోల్ కాంబినేషన్‌తో ఈ మందును తయా రు చేసింది సంస్థ. సంస్థకు ప్రపంచవ్యాప్తంగా 126 దేశాల్లో 36 ప్లాంట్లు ఉన్నాయి.

843
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles