ఆకట్టుకున్న హెచ్‌డీఎఫ్‌సీ

Tue,May 14, 2019 12:50 AM

HDFC Q4 profit rises 27 Percent

-క్యూ4లో 27 శాతం పెరిగిన లాభం

ముంబై, మే 13: దేశంలో మార్ట్‌గేజ్ రుణాలు అందించే అగ్రగామి సంస్థయైన హెచ్‌డీఎఫ్‌సీ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. మార్చి 31తో ముగిసిన త్రైమాసికానికిగాను సంస్థ రూ.2,862 కోట్ల లాభాన్ని గడించింది. ఆస్తుల నాణ్యత ప్రమాణాలు మెరుగుపడటం, బ్యాలెన్స్ షీట్ అధికమవడం ఇందుకు దోహదం చేశాయని కంపెనీ పేర్కొంది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో నమోదైన రూ.2,257 కోట్ల నికర లాభంతో పోలిస్తే 27 శాతం వృద్ధిని కనబరిచింది. సమీక్షకాలంలో సంస్థ ఆదాయం రూ. 9,322.36 కోట్ల నుంచి రూ.11,586.58 కోట్లకు ఎగబాకింది. మొత్తంమీద బ్యాలెన్స్ షీట్ వృద్ధి బాట పట్టింది.. నిరర్థక ఆస్తులు కూడా తగ్గుముఖం పట్టడం శుభసూచికమని హెచ్‌డీఎఫ్‌సీ వైస్ చైర్మన్, సీఈవో కెకి మిస్త్రీ తెలిపారు. గడిచిన ఆర్థిక సంవత్సరం మొత్తానికి రూ.9,633 కోట్లు పన్నులు చెల్లించిన తర్వాత నికర లాభాన్ని ఆర్జించింది. 2017-18లో నమోదైన రూ.10,959 కోట్లతో పోల్చుకోవాల్సిన అవసరం లేదని, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌లో వాటా విక్రయించడం ద్వారా రూ.5,265 కోట్ల నిధులు సమకూరడం వల్లనే అప్పట్లో లాభాల్లో భారీ వృద్ధి నమోదైందని ఆయన పేర్కొన్నారు. నికర వడ్డీ మార్జిన్ 3.3 శాతంగా ఉండగా, నికర వడ్డీ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 19 శాతం పెరిగి రూ.3,161 కోట్లుగా ఉన్నది. కంపెనీ స్థూల నిరర్థక ఆస్తుల విలువ రూ.4,777 కోట్లు లేదా 1.18 శాతంగా నమోదైంది. మార్చి 31 నాటికి కంపెనీ లోన్ బుక్ రూ.4,06,607 కోట్లకు చేరుకున్నది. అంతక్రితం ఏడాది రూ.3,62,811 కోట్లతో పోలిస్తే 17 శాతం ఎగబాకింది. గతేడాది రెండో అర్థభాగంలో వ్యక్తిగతేర రుణాలు ఆమోదయోగ్య స్థాయిలో లేకపోవడంతో రుణ వితరణ తగ్గుముఖం పట్టిందని, వీటికితోడు మార్కెట్లో నిధుల లభ్యత తగ్గుముఖం పట్టడం పరోక్షంగా కారణమైంది. క్యాపిటల్ అడెక్వసి రేషియో 19.2 శాతంగా ఉండగా, టైర్-1 క్యాపిటల్ 17.6 శాతం, టైర్-2 క్యాపిటల్ 1.6 శాతంగా ఉన్నది.

రూ.17.50 తుది డివిడెండ్

గడిచిన ఆర్థిక సంవత్సరానికిగాను ప్రతిషేరుకు రూ.17.50 తుది డివిడెండ్‌ను చెల్లించనున్నట్లు కంపెనీ బోర్డు ప్రకటించింది. మధ్యంతర డివిడెండ్ కింద చెల్లించిన రూ.3.50 దీనికి అదనం. దీంతో మొత్తం డివిడెండ్ రూపంలో రూ.21 చెల్లించనున్నది. అంతక్రితం ఏడాది డివిడెండ్ రూపంలో రూ.20 చెల్లించిన విషయం తెలిసిందే. వీటితోపాటు నాన్-కన్వర్టబుల్ డిబెంచర్ల లేదా హైబ్రిడ్ ఇన్‌స్ట్రూమెంట్లను జారీ చేయడం ద్వారా రూ.1.25 లక్షల కోట్ల నిధుల సేకరణకు బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే నసీర్ ముంజీ, జేజే ఇరానీని తిరిగి ఇండిపెండెంట్ డైరెక్టర్లుగా నియమించుకున్నది. జూలై 21, 2019 నుంచి వచ్చే రెండేండ్ల వరకు వీరిద్దరు పదవిలో కొనసాగనున్నారు.

డిజిటల్ ఇన్నోవేషన్‌కు మూడు స్టార్టప్‌లు

హెచ్‌డీఎఫ్‌సీ అనుబంధ సంస్థయైన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్..హైదరాబాద్‌కు చెందిన మూడు స్టార్టప్‌లను తుది జాబితాకు ఎంపిక చేసింది. వీటిలో లూప్ రియల్టీ, బ్లూసప్పైర్, అప్నోవేషన్ టెక్నాలజీలను డిజిటల్ ఇన్నోవేషన్ సమ్మిట్‌కు ఎంపిక చేసింది. నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ గతంలో డీఐఎస్ ప్లాట్‌ఫామ్‌ను ఏర్పాటు చేసింది.

784
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles