హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో 600 ఉద్యోగాలు

Thu,January 10, 2019 11:33 PM

రాష్ట్రంలో మరో ఏడు శాఖలను ప్రారంభించనున్న సంస్థ
హైదరాబాద్, జనవరి 10: దేశంలో రెండో అతిపెద్ద బ్యాంకైన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ రాష్ట్రంలో వ్యాపారాన్ని శరవేగంగా విస్తరిస్తున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే 14 శాఖలను ప్రారంభించిన సంస్థ.. వచ్చే రెండు నెలల్లో మరో ఏడు బ్రాంచ్‌లను ప్రారంభించడానికి సిద్ధమైంది. హైదరాబాద్‌లో గురువారం జరిగిన కార్యక్రమంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ దక్షిణాది విభాగాధిపతి మధుసూదన్ హెగ్డే మాట్లాడుతూ.. ఈ ఏడాది 21 శాఖలను ప్రారంభించాలని గతంలో నిర్ణయించడం జరిగిందని, వీటిలో ఇప్పటికే 14 శాఖలను ఆరంభించగా, మరో రెండు నెలల్లో మిగతావి ప్రారంభించనున్నట్లు చెప్పారు. దీంతో రాష్ట్రంలో శాఖల సంఖ్య 208కి చేరుకోనున్నది. ఒక్కో శాఖను ఏర్పాటు చేయాలంటే కనీసంగా పది మంది సిబ్బంది అవసరమవుతారని, దీంతో యేటా 500-600 వరకు ఉద్యోగులను నియమించుకోవడం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో బ్యాంకుకు 6 వేల మంది సిబ్బంది ఉన్నారని చెప్పారు. బ్యాంక్ మొత్తం వ్యాపారంలో దక్షిణాది వాటా అధికంగా ఉంటుందని, గడిచిన తొమ్మిది నెలల్లో డిపాజిట్లలో 23 శాతం, అడ్వాన్స్‌లలో 24 శాతం పెరుగుదల నమోదైందన్నారు. కాగా, ఆంధ్రప్రదేశ్‌లో మరో 11 శాఖలను ప్రారంభించపోతున్నట్లు చెప్పారు.

వచ్చే నెల 10న సేవ్‌థాన్

హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్డులోగల సంజీవయ్య పార్క్‌లో సేవ్‌థాన్ పేరుతో వచ్చే నెల 10న ప్రత్యేక రన్ నిర్వహిస్తున్నట్లు హెగ్డే ప్రకటించారు. రన్ ఫర్ గ్రీన్ పేరిట నిర్వహిస్తున్న ఈ బృహత్ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ చుట్టు 25 వేల మొక్కలను పంపిణీ చేయనున్నారు. ఈ కార్యక్రమానికి హెచ్‌ఎండీఏ, అటవీ శాఖలు తమ మద్దతుగా 25 వేల మొక్కలను అందిస్తున్నట్లు ఆయన చెప్పారు. గతేడాది నిర్వహించిన రన్‌లో 5 వేల మంది పాల్గొనగా, ఈసారి 8 వేల మంది పాల్గొనే అవకాశం ఉందన్నారు.

2543
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles