‘హ్యాప్పీ’ పండుగ ఆఫర్లు

Thu,October 11, 2018 02:16 AM

Happi festival offers for Dussehra and diwali

హైదరాబాద్, అక్టోబర్ 10: రిటైల్ మొబైల్ విక్రయ సంస్థ హ్యాప్పీ..దసరా, దీపావళి పండుగను దృష్టిలో పెట్టుకొని రూ.5 కోట్ల విలువైన బహుమతులను అందిస్తున్నట్లు ప్రకటించింది. హ్యాప్పీ ఫెస్టివ్ పటాకా పేరుతో ప్రకటించిన ఈ ఆఫర్ వచ్చే నెల చివరి వరకు అందుబాటులో ఉంటుంది. ఈ ఆఫర్లలో భాగంగా ప్రతి మొబైల్ కొనుగోలుపై కచ్చితమైన బహుమతిని అందిస్తున్నది. డ్యూయల్ కెమెరా ఫోన్‌ను కేవలం రూ.399కే, రూ.14,999 విలువ కలిగిన స్మార్ట్‌ఫోన్‌పై రూ.10,590 ధర కలిగిన మైక్రోమాక్స్ ఎల్‌ఈడీ టీవీ, హానర్ 9లైట్ మొబైల్‌పై రూ.2,999 విలువ కలిగిన స్పోర్ట్స్ వైర్లెస్ హెడ్‌సెట్స్, మోబిస్టార్ ఎక్స్1 డ్యూయల్ మొబైల్‌పై రూ.4,500 విలువైన కెంట్ వాక్యూమ్ క్లీనర్, లావా జెడ్91పై రూ.2,499 ధర కలిగిన 4.1 హోమ్ థియేటర్, కార్బన్ ఏ40 ఇండియన్ మొబైల్‌పై రూ.2,100 విలువ కలిగిన బుల్లెట్ జ్యూసర్, డీటెల్ 1400డీ మొబైల్‌పై రూ.1,095ల ఫ్రెషర్ కుక్కర్‌ను ఉచితంగా అందిస్తున్నట్లు కంపెనీ సీఎండీ కృష్ణ పవన్ తెలిపారు.

4915
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles