ఎస్సార్ స్టీల్‌కు కోర్టులో చుక్కెదురు


Tue,July 18, 2017 12:27 AM

ఆర్బీఐ చర్యలను సవాలు చేస్తూ సంస్థ దాఖలు చేసిన పిటిషన్ తిరస్కరణ
essar
అహ్మదాబాద్, జూలై 17: బకాయిల రికవరీకి సంబంధించి సంస్థకు అప్పులిచ్చిన బ్యాంకులకు ఆర్బీఐ జారీ చేసిన ఆదేశాలను న్యాయస్థానంలో సవాలు చేసిన ఎస్సార్ స్టీల్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సంస్థ పిటిషన్‌ను గుజరాత్ హైకోర్టు తోసిపుచ్చింది. ఈ విషయంలో సంస్థకెలాంటి ఊరటనిచ్చేందుకు కోర్టు ధర్మాసనం నిరాకరించింది. ఎస్సార్ స్టీల్ బ్యాంకులకు రూ.42 వేల కోట్లకు పైగా బకాయిలు చెల్లించాల్సి ఉంది. బ్యాంకింగ్ రంగంలో మొండిబకాయిల (ఎన్‌పీఏ) సమస్యను పరిష్కరించేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా ఆర్బీఐకి విశేషాధికారాలు కట్టబెట్టింది. తద్వారా ఆర్బీఐకి.. బకాయిలు చెల్లించని సంస్థలపై దివాలా చట్టం ప్రకారంగా చర్యలు చేపట్టాలని బ్యాంకులను ఆదేశించే అధికారాలు సంక్రమించాయి. ఇందుకు అనుగుణంగా ఆర్బీఐ.. ఎస్సార్ స్టీల్‌తోసహా రూ.5 వేల కోట్లకు పైగా బకాయిపడ్డ 12 సంస్థలపై దివాలా కోడ్ ప్రయోగించాలని గతనెల 13న సర్క్యులర్ జారీ చేసింది. అయితే, తాము రుణాలను పునర్వ్యవస్థీకరించుకునే ప్రయత్నాల్లో ఉండగా ఈ అస్ర్తాన్ని ప్రయోగించడం సరికాదంటూ ఎస్సార్ స్టీల్ కోర్టుకెక్కింది.

158

More News

VIRAL NEWS