ప్రభుత్వ ఆదాయం పెరిగితేనే జీఎస్టీ రేట్ల తగ్గుదల


Sun,August 13, 2017 12:01 AM

ఆర్థిక శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్
oldman
కోల్‌కతా, ఆగస్టు 12: జీఎస్టీ హయాంలో పన్ను శ్లాబు రేట్ల తగ్గుదల ప్రభుత్వ ఆదాయం పెరుగడంపైనే ఆధారపడి ఉందని కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖల సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ అన్నారు. జీఎస్టీ చట్టంలో పన్ను రేటును నాలుగు శ్లాబులుగా (5, 12, 18, 28 శాతం) నిర్ణయించారు. గత పరోక్ష పన్నుల చట్టం హయాంలో దేశంలో 80 లక్షల మంది పన్ను చెల్లింపుదారులుండేవారని, జీఎస్టీ అమలుతో కొత్తగా 13.2 లక్షల మంది పన్ను పరిధిలోకి వచ్చారని మంత్రి తెలిపారు. అందులో 56 వేల మంది పశ్చిమ బెంగాల్ రాష్ర్టానికి చెందినవారేనని ఆయన వెల్లడించారు. మున్ముందు జీఎస్టీ నెట్‌వర్క్‌ను (జీఎస్టీఎన్) మరింత మెరుగుపర్చడం జరుగుతుందన్నారు. ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్, రివర్స్ చార్జ్ మెకానిజం కోసం డీలర్లు తమ ఆర్థిక లావాదేవీల వివరాలను కంప్యూటరీకరించాలని ఆయన కోరారు. నల్లబజారు కార్యకలాపాలను అరికట్టేందుకే ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టిందన్నారు.

153

More News

VIRAL NEWS