బంగారంపై 3% జీఎస్టీ చాలా తక్కువ

Sun,August 13, 2017 12:01 AM

GST on gold fixed at 3% against current tax of 2%

ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు
అరవింద్ సుబ్రమణియన్

gold-bullion
న్యూఢిల్లీ, ఆగస్టు 12: బంగారంపై ప్రస్తుతం విధిస్తున్న పన్ను చాలా తక్కువని, మరింత పెంచాల్సిన అవసరం ఉందని ఆర్థిక సర్వే నివేదికలో ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ అభిప్రాయపడ్డారు. ధనికులు అధికంగా కొనుగోలు చేసే బంగారం, ఆభరాణాలపై ప్రస్తుతం విధిస్తున్న 3 శాతం జీఎస్టీ రేటు కనిష్ఠ స్థాయిలో ఉంది అని శుక్రవారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వే 2016-17 రెండో భాగం పేర్కొన్నారు. సుబ్రమణియన్ ఈ నివేదిక రూపకర్త.

ధనవంతులు కూడా విద్య, వైద్య సేవలు పొందుతారు కాబట్టి వాటిని సైతం జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని రిపోర్టు అభిప్రాయపడింది. ప్రభుత్వం ప్రస్తుతం విద్య, వైద్య సేవలకు జీఎస్టీ నుంచి మినహాయింపునిచ్చింది. విద్యుత్‌ను సైతం జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడం ద్వారా ఆ రంగ సంస్థల మధ్య పోటీతత్వం పెరుగుతుందని ఆర్థిక సర్వే రిపోర్టు పేర్కొంది. ప్రస్తుతం కొత్త పరోక్ష పన్నుల చట్టం నుంచి మినహాయింపు కల్పించిన కొన్ని రియల్టీ లావాదేవీలతోపాటు ఆల్కహాల్‌పైనా జీఎస్టీ విధించడం ద్వారా పారదర్శకత పెంచి, అవినీతిని తగ్గించవచ్చని రిపోర్టు సూచించింది.

204

More News

VIRAL NEWS

Featured Articles