20న జీఎస్టీ మండలి సమావేశం

Mon,June 10, 2019 02:25 AM

GST Council to meet on 20 June may fix Rs50 cr turnover threshold for e invoice

-ఈ-ఇన్వాయిస్ టర్నోవర్ పరిమితి రూ.50 కోట్లు
-ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రతిపాదించే అవకాశం
న్యూఢిల్లీ, జూన్ 9: ఈ నెల 20న వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) మండలి సమావేశం కానున్నది. ఈ సందర్భంగా బిజినెస్ టు బిజినెస్ (బీ2బీ) అమ్మకాల కోసం కేంద్రీకృత ప్రభుత్వ పోర్టల్‌పై ఈ-ఇన్వాయిస్ పొందడానికి టర్నోవర్ పరిమితిని రూ.50 కోట్లుగా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రతిపాదించే అవకాశాలున్నాయి. జీఎస్టీ ఎగవేతలకు అడ్డుకట్ట వేయడంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకోవచ్చన్న సంకేతాలున్నాయి. ఈ మేరకు ఓ ఉన్నతాధికారి ద్వారా అందుతున్న సమాచారం. రాష్ర్టాలతో సంప్రదింపుల తర్వాత ఈ-ఇన్వాయిస్ జారీ కోసం టర్నోవర్ పరిమితిపై ఓ తుది నిర్ణయం తీసుకోవచ్చని చెబుతున్నారు. కాగా, దాఖలైన రిటర్నుల ప్రకారం రూ.50 కోట్లకుపైగా టర్నోవర్ ఉన్న వ్యాపారులు 68,041 మంది ఉన్నారు. 2017-18 మొ త్తం జీఎస్టీ చెల్లింపులకు అన్వయించుకుని చూ సినైట్లెతే వీరి టర్నోవర్ వాటా 66.6 శాతంతో సమానం.

అయినప్పటికీ జీఎస్టీ చెల్లింపుదారుల్లో వీరు 1.02 శాతం మాత్రంగానే ఉన్నారు. వ్యవస్థలో నమోదవుతున్న దాదాపు 30 శాతం బీ2బీ ఇన్వాయిస్‌లు వీరివే. దీంతో పన్ను ఎగవేతలు భారీగా ఉన్నాయన్న నిర్ణయానికొచ్చిన కేంద్రం.. వాటికి చెక్ పెట్టాలనే ఈ-ఇన్వాయిస్ వ్యవస్థను తీసుకొస్తున్నది. దానికి రూ.50 కోట్ల టర్నోవర్ పరిమితి ప్రతిపాదనతో ముందుకొస్తున్నదని సదరు అధికారి పీటీఐకి తెలిపారు. ప్రతి నెలా రూ. 50,000లకు మించి 3.9 కోట్ల బీ2బీ ఇన్వాయిస్‌లు నమోదవుతున్నాయి. రోజుకు 12 ల క్షల చొప్పున జారీ అవుతున్నాయి. మొత్తం బీ2బీ ఇన్వాయిస్‌లను పరిగణనలోకి తీసుకుంటే కోటీపైనే. కాగా, సెప్టెంబర్ నుంచి ఈ-ఇన్వాయిస్ వ్యవస్థను ప్రారంభించడానికి కేం ద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రయత్నిస్తున్నది.

774
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles