జీఎస్టీలో స్థానిక వ్యాపారాలు కీలకం!

Fri,August 23, 2019 12:05 AM

GST Advantages for Startups and Small Businesses

-రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ అదనపు కమిషనర్ లక్ష్మీనారాయణ కితాబు

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: తెలంగాణ రాష్ట్రంలో జీఎస్టీ విజయవంతంగా అమలు కావడానికి స్థానిక వ్యాపార సంఘాల పాత్ర మరువలేనిదని రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ అదనపు కమిషనర్ జే లక్ష్మీనారాయణ తెలిపారు. గురువారం హైదరాబాద్‌లో సీఐఐ జీఎస్టీపై ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వర్క్‌షాపునకు ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో వివిధ పరిశ్రమల ప్రతినిధులు జీఎస్టీకి సంబంధించి అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానాలిచ్చారు. సీఐఐ మాజీ ఛైర్మన్ ఎంకే పటోడియా మాట్లాడుతూ.. ప్రపంచంలోనే మనది భిన్నమైన జీఎస్టీ విధానమని, ఫెడరల్ వ్యవస్థను ప్రతిబింబిస్తూ సులభంగా ఆర్థిక లావాదేవీలు జరిగేందుకు తోడ్పడుతుందన్నారు. కేపీఎంజీ నిపుణులు జీఎస్టీకి సంబంధించిన ఈ- వే బిల్లు, వాస్తవిక సమస్యలు, ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్, కొత్త జీఎస్టీ రిటర్నులు, జీఎస్టీ వార్షిక రిటర్నులు, ఆడిట్ రిపోర్టు వంటి అంశాల గురించి ప్రత్యేకంగా వివరించారు. జీఎస్టీకి అమలులో సంస్థలు ఎదుర్కొంటున్న సమస్యలకు అక్కడికక్కడే పరిష్కారం చూపెలా సీఈఈ ఈ సదస్సును ఏర్పాటు చేసింది.

332
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles