కోరమాండల్ లాభంలో వృద్ధి

Wed,October 23, 2019 04:57 AM

హైదరాబాద్, అక్టోబర్ 22: ప్రముఖ ఎరువుల తయారీ సంస్థ కోరమాండల్ ఆశాజనక ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. సెప్టెంబర్ 30తో ముగిసిన మూడు నెలలకాలానికిగాను కంపెనీ రూ.503 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని నమోదు చేసుకున్నది. గతేడాది ఇదే సమయంలో నమోదు చేసుకున్న రూ.366 కోట్లతో పోలిస్తే 37 శాతం వృద్ధి చెందింది. లాభాల్లో వృద్ధిని నమోదు చేసుకున్న సంస్థకు ఆదాయంలో మాత్రం నిరాశే ఎదురైంది. కంపెనీ ఆదాయం రూ.5,018 కోట్ల నుంచి రూ.4,867 కోట్లకు పడిపోయింది. ఈ సందర్భంగా కంపెనీ ఎండీ సమీర్ గోయల్ మాట్లాడుతూ..గత త్రైమాసికంలో బలమైన వృద్ధిని నమోదు చేసుకున్నాం..అమ్మకాల్లో మిశ్రమ స్పందన వ్యక్తమైనప్పటికీ తయారీ రంగంపై ప్రత్యేక దృష్టి సారించడం ఇందుకు కలిసొచ్చిందన్నారు. దక్షిణ భారతంలో వర్షాలు సాధారణం కంటే అధికంగా కురియడం సంస్థకు దన్నుగా నిలిచిందన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో రూ.7,008 కోట్ల కన్సాలిడేటెడ్ ఆదాయంపై రూ.710 కోట్ల లాభాన్ని ఆర్జించింది.

179
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles