కలసలింగమ్ విద్యార్థులకు భారీ ఉద్యోగ అవకాశాలు


Fri,May 19, 2017 11:57 PM

హైదరాబాద్, మే 19: కలసలింగమ్ విశ్వవిద్యాలయంలో చదువుకున్న విద్యార్థులకు భారీగా ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి.గతేడాది 82 మల్టీనేషనల్ కంపెనీలు క్యాంపస్ రిక్రూట్‌మెంట్లను నిర్వహించి 1,503 మంది విద్యార్థులను రిక్రూ ట్ చేసుకున్నాయి. ఈ యూనివర్సిటీలో చేరిన రోజు నుంచే విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు ముఖ్యంగా క్యాంపస్ రిక్రూట్‌మెంట్లకు సంబంధించి నూతన మెళుకువలు నేర్పనున్నది. ప్రస్తుతం సంస్థ ఎరోనాటికల్, బయో మెడికల్, కెమికల్, ఆటోమొబైల్ ఇంజినీరింగ్‌కు సంబంధించి అన్ని రకాల కోర్సులను ఆఫర్ చేస్తున్నది. వీటితోపాటు అమెరికా, బ్రిటన్, జర్మనీ, ఇజ్రాయిల్, దక్షిణ కొరియా, ఇండోనేషియా, జపాన్‌లకు చెందిన వర్సిటీలతో ఒప్పందం కుదుర్చుకున్నది.

217

More News

VIRAL NEWS