ఎన్‌పీఏలపై వేగంగా చర్యలు చేపట్టండి..


Tue,November 14, 2017 12:24 AM

ప్రభుత్వ రంగ బ్యాంకులకు ఆర్థిక శాఖ సూచన
Redwood-bank
న్యూఢిల్లీ, నవంబర్ 13: మొండిబకాయిల(ఎన్‌పీఏ) సమస్యను ఎదుర్కొనేందుకు వేగంగా చర్యలు తీసుకోవాలని, కఠినంగా వ్యవహరించాలని ఆర్థిక శాఖ ప్రభుత్వ రంగ బ్యాంకులను (పీఎస్‌బీ) కోరింది. ఆదివారంతో ముగిసిన పీఎస్‌బీ మంథన్ సమావేశంలో ఎన్‌పీఏ సమస్యపైనా చర్చ జరిగిందని, మొండిబకాయిలపై వేగంగా చర్యలు చేపట్టాలని ఆర్థిక శాఖ కోరినట్లు ఓ బ్యాంకర్ తెలిపారు. ఈ ఏడాది జూన్ చివరినాటికి పీఎస్‌బీల్లో మొండిబకాయిలు రూ.7.33 లక్షల కోట్ల స్థాయికి చేరుకున్నాయి. ఒత్తిడిలో ఉన్న రుణాల రికవరీని మెరుగుపర్చే అంశంపైనా సమావేశంలో ప్రధానంగా చర్చ జరిగిందని ఓ సీనియర్ బ్యాంకర్ వెల్లడించారు. ఎన్‌పీఏల పరిష్కారంలో భాగంగా బకాయిల రికవరీ రేటు పెంచుకోగలగడంపైనా చర్చించినట్లు ఆయన చెప్పారు. అంతేకాదు, ఎన్‌పీఏల భారాన్ని తగ్గించుకునేందుకు సెటిల్‌మెంట్ ద్వారా కేసులను పరిష్కరించుకునేందుకు అవకాశాలపైనా దృష్టిపెట్టాలని ఆర్థిక శాఖ సూచించిందన్నారు. మొండిబకాయిల వల్ల ఏర్పడిన గండిని పూడ్చుకునేందుకు బ్యాంకులు గడిచిన రెండు ఆర్థిక సంవత్సరాల్లో భారీగా కేటాయింపులు జరిపాయి. 2014-15 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం నుంచి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2017-18) తొలి క్వార్టర్ వరకు బ్యాంకుల మొండిబకాయిల ప్రొవిజనింగ్‌లు రూ.3.79 లక్షల కోట్లకు చేరుకున్నాయి. అంతక్రితం పదేండ్లలో ప్రొవిజనింగ్‌లు రూ.1.96 లక్షల కోట్లుగా నమోదయ్యాయి.

142
Tags

More News

VIRAL NEWS