ప్రియంకానున్న యూఎస్‌బీ కేబుల్స్


Tue,July 18, 2017 12:24 AM

10 శాతం దిగుమతి సుంకాన్ని విధించిన కేంద్రం
usb-cables
న్యూఢిల్లీ, జూలై 17: దేశవ్యాప్తంగా తయారైన ఉత్పత్తులను మరింత ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నది. విదేశాల నుంచి దిగుమతి అవుతున్న స్మార్ట్‌ఫోన్ల కోసం వినియోగించే యూఎస్‌బీ కేబుల్స్‌పై 10 శాతం దిగుమతి సుంకాన్ని విధిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఈ కేబుల్స్ మరింత ప్రియంకాబోతున్నాయి. ఇప్పటి వరకు కేవలం కస్టమ్స్ పన్నును మాత్రమే విధించేవారు. ఈ యూఎస్‌బీ కేబుల్స్‌ను మొబైల్ చార్జింగ్, అలాగే కంప్యూటర్, ల్యాప్‌టాప్, టీవీ లేదా ట్యాబ్లెట్ల కోసం వినియోగించేవారు. ఇండియన్ సెల్యులార్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు పంకజ్ మోహింద్రో మాట్లాడుతూ..దేశీయంగా తయారైన వస్తువులను ప్రోత్సహించడంలో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని, తద్వారా దేశవ్యాప్తంగా మొబైల్ విడిభాగాల ఉత్పత్తి మరింత పెరిగే అవకాశం ఉందన్నారు.

183

More News

VIRAL NEWS