వైజాగ్‌లో రెండో విమానాశ్రయం!

Mon,June 10, 2019 02:16 AM

Govt pursuing efforts to set up second airport in major cities

-సంకేతాలిచ్చిన ఏఏఐ చైర్మన్ గురుప్రసాద్
సియోల్, జూన్ 9: విమాన ప్రయాణికుల పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా అతిపెద్ద నగరాల్లో రెండో విమానాశ్రయం ఏర్పాటు చేసే అవకాశాలను పౌర విమానయాన మంత్రిత్వ శాఖ పరిశీలిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. విమానాశ్రయ ఏర్పాటుకు సంబంధించి భూమిని కేటాయించడానికి ముందుకువచ్చిన రాష్ట్ర ప్రభుత్వాలకు అధిక ప్రాధాన్యతనివ్వడంతోపాటు అక్కడ రెండో ఎయిర్‌పోర్ట్ నెలకొల్పేదానిపై త్వరలో నిర్ణయం తీసుకోనున్నట్లు ఎయిర్‌పోర్ట్స్ ఆథార్టీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) చైర్మన్ గురుప్రసాద్ మోహపాత్రా తెలిపారు. ఇప్పటికే ఏఏఐ ఆధ్వర్యంలో 125 విమానాశ్రయాలు నడుస్తుండగా, వీటిలో 11 అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్‌లు ఉన్నాయి. విమానాశ్రయల ఏర్పాటుకు భూసేకరణ చాలా సమస్యగా మారిందని, ఒక్కో విమానాశ్రయాన్ని నిర్మించడానికి కనీసంగా 2 వేల ఎకరాల భూమి అవసరమవుతుందన్నారు.

భూసేకరణకు సంబంధించి విమానయాన మంత్రిత్వశాఖ, ఏఏఐలు కలిసి ఇప్పటికే పలు రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు కూడా రాసినప్పటికి ఎలాంటి స్పందన లేదని పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు. ఇప్పటికే ముంబై, ఢిల్లీలలో రెండు విమానాశ్రయాలు ఉండగా..విశాఖపట్నంలో కూడా రెండో విమానాశ్రయాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందన్నారు. వీటితోపాటు కోల్‌కతా, చెన్నై, పుణెతోపాటు ఇతర నగరాల్లో రెండో ఎయిర్‌పోర్ట్ నిర్మించడానికి ప్రణాళికలు రచిస్తున్నట్లు ఆయన చెప్పారు. ప్రపంచంలో అధిక వృద్ధిని నమోదు చేసుకుంటున్న విమానయాన రంగంల్లో ఒకటైన భారత్‌లో ఏప్రిల్ నెలలో ప్రతికూల వృద్ధి నమోదైంది. ఆర్థిక సంక్షోభంతో మూతపడిన జెట్ ఎయిర్‌వేస్ ఇందుకు కారణమన్నారు. ఏప్రిల్ నెలలో 2.67 కోట్ల మంది ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకోగా, 2.75 లక్షల టన్నుల సరుకు రవాణా అయింది.

3313
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles