కేవలం 7 శాతమే!


Mon,July 17, 2017 12:25 AM

పెద్ద నోట్ల రద్ద తర్వాత కార్డు లావాదేవీల్లో వృద్ధిపై కేంద్రం
creditcards
న్యూఢిల్లీ, జూలై 16: పెద్ద నోట్ల రద్దు తర్వాత డిజిటల్ లావాదేవీలు 23 శాతం వృద్ధి చెందాయని పార్లమెంటరీ ప్యానెల్‌కు ప్రభుత్వం వెల్లడించింది. అందులో డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా లావాదేవీలు మాత్రం కేవలం 7 శాతం వృద్ధిని నమోదు చేసుకున్నాయని ఆయన వెల్లడించారు. పెద్ద నోట్ల రద్దు, డిజిటల్ ఆర్థిక వ్యవస్థగా పరివర్తనం అనే అంశంపై ఆర్థిక వ్యవహారాలు పర్యవేక్షించే పార్లమెంటరీ స్థాయి కమిటీ ముందు పలు మంత్రిత్వ శాఖల అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారు.

గత ఏడాది నవంబర్‌లో 2.24 కోట్ల డిజిటల్ లావాదేవీలు నమోదుకాగా.. మే 2017లో సంఖ్య 23 శాతం పెరిగి 2.75 కోట్లకు చేరుకుందని ప్రజెంటేషన్‌లో వెల్లడించారు. అందులో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) ద్వారా చెల్లింపుల్లో అధిక వృద్ధి నమోదైంది. నవంబర్ 2016లో యూపీఐ ద్వారా పది లక్షల లావాదేవీలు నమోదుకాగా.. మే 2017లో సంఖ్య 3 కోట్లకు చేరుకుంది. తక్షణ చెల్లింపుల సేవల(ఐఎంపీఎస్) ద్వారా లావాదేవీలు 12 లక్షల నుంచి 22 లక్షల స్థాయికి చేరుకున్నాయి. ఇక డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా లావాదేవీల సంఖ్య 68 లక్షల నుంచి 73 లక్షలకు పెరిగిందని ప్రజెంటేషన్‌లో పేర్కొన్నారు.

164

More News

VIRAL NEWS