పీఎఫ్‌సీ చేతికి ఆర్‌ఈసీలో ప్రభుత్వ వాటా

Thu,December 6, 2018 01:04 AM

Government proposes PFC buy REC in Rs 15000 crore deal

న్యూఢిలీ, డిసెంబర్ 5: రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పోరేషన్ (ఆర్‌ఈసీ)లో ప్రభుత్వానికి ఉన్న వాటాను రూ. 15,000 కోట్లకు కొనుగోలు చేసే ప్రతిపాదనను కేంద్ర మంత్రివర్గం గురువారం నాడు పరిశీలించనున్నది. ఇటీవలి ఈటీఎఫ్ ఇష్యూ తర్వాత ఆర్‌ఈసీలో ప్రభుత్వానికి ఉన్న 57.99 శాతం వాటా 52.63 శాతానికి తగ్గింది. ఆర్‌ఈసీలోని 52.63 శాతం వాటాను పీఎఫ్‌సీ కొనుగోలు చేయడంతోపాటు మేనేజ్‌మెంట్ కంట్రోల్ బదలాయించే అంశాన్ని మంత్రివర్గం పరిశీలించనుంది. బుధవారం నాడు ఆర్‌ఈసీ షేరు రూ. 105.10 వద్ద ముగిసింది. దీంతో ప్రభుత్వానికి ఉన్న వాటా విలువ రూ. 11,000 కోట్లు. ప్రభుత్వం ప్రీమియం ఆశించే అవకాశం ఉన్నందున డీల్ విలువ రూ. 15,000 కోట్లకు పెరుగవచ్చు. తొలుత పీఎఫ్‌సీని ఆర్‌ఈసీ విక్రయించాలని భావించింది. అయితే ఆర్‌ఈసీలోని వాటాను పీఎఫ్‌సీ కొనుగోలు చేయాలని విద్యుత్ శాఖ నిర్ణయించింది.

334
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS