మరో 5 కోట్ల ఉద్యోగాలు!

Tue,December 3, 2019 12:30 AM

- ఎంఎస్‌ఎంఈ రంగంపై ప్రభుత్వం ధీమా


న్యూఢిల్లీ, డిసెంబర్‌ 2: సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థ (ఎంఎస్‌ఎంఈ)లు ఇప్పటిదాకా 11 కోట్ల ఉద్యోగాలను సృష్టించాయని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ తెలిపారు. 2024 నాటికి మరో 5 కోట్ల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా పెట్టుకున్నామని సోమవారం రాజ్యసభలో చెప్పారు. ‘ఎంఎస్‌ఎంఈలు.. దేశ వృద్ధి చోదకాలు. ప్రస్తుతం జీడీపీలో ఈ సంస్థల వాటా 29 శాతంగా ఉన్నది. దేశ ఎగుమతుల్లో కూడా ఎంఎస్‌ఎంఈల వాటా 49 శాతం. ఎంఎస్‌ఎంఈలు ఇప్పటివరకు 11 కోట్ల ఉద్యోగాలను సృష్టించాయి’ అని ఎంఎస్‌ఎంఈ శాఖ మంత్రి గడ్కరీ అన్నారు. 2019-24 మధ్య ఐదేండ్లకుగాను అదనంగా 5 కోట్ల ఉద్యోగాలను సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. దీనివల్ల జీడీపీలో, ఎగుమతుల్లో కూడా ఎంఎస్‌ఎంఈల వాటా పెరుగుతుందన్నారు. కాగా, రాబోయే రెండేండ్లలో 12 టెక్నాలజీ సెంటర్లను ఏర్పాటు చేయబోతున్నామని, రూ.200 కోట్ల పథకంలో భాగంగా ఇవి వస్తున్నాయని తెలిపారు.

జీతాలు 9.2 శాతం పెరుగొచ్చు

వచ్చే ఏడాది దేశంలో ఉద్యోగుల జీతాలు 9.2 శాతం మేర పెరుగవచ్చని కోర్న్‌ ఫెర్రి గ్లోబల్‌ అంచనా వేసింది. ఇది ఆసియా దేశాల్లో అత్యధికమని పేర్కొన్నది. అయితే ద్రవ్యోల్బణంతో కొంత ఇబ్బంది రావచ్చని అభిప్రాయపడింది. నిజానికి గతేడాది వేతనాల పెంపు 10 శాతంగా ఉన్నది. ఈసారి తగ్గుతుండటం గమనార్హం. ప్రభుత్వ సంస్కరణల ఫలాలు అందితే మరింత మెరుగైన ఫలితాలు రావచ్చని సంస్థ ఇండియా విభాగం చైర్మన్‌ నవనీత్‌ సింగ్‌ అన్నారు.

376
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles